పార్టీ అధిష్ఠానం ఏ పదవి ఇచ్చినా సరే..: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

క్యాబినెట్‌లో మార్పులు, చేర్పులు ఉండే అవకాశం ఉంది.

Komatireddy Rajagopal Reddy: కాంగ్రెస్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ప్రజలు ఎదురుచూస్తున్న శుభవార్త త్వరలోనే వస్తుందనుకుంటున్నానని చెప్పారు. కాంగ్రెస్ అధిష్ఠానం తనకు ఏ పదవి ఇచ్చినా సంతృప్తిగా చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు.

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో అభివృద్ధి పనులను పరిశీలించిత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మున్సిపాలిటీ సమస్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తామని చెప్పారు. స్థలం ఉండి కట్టుకునే వారికి ర.5 లక్షలు ఇస్తామని తెలిపారు.

Also Read: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కి అభినందనలు అంటూ చంద్రబాబు ట్వీట్

అలాగే, ఇంటి స్థలంలేని నిరుపేదలకు డబుల్ బెడ్రూంలు తొందర్లోనే ఇస్తామని చెప్పారు. గత ప్రభుత్వంలో లాగా మాట ఇచ్చి తప్పే ప్రభుత్వం తమది కాదని అన్నారు. కాగా, తెలంగాణ మంత్రవర్గ విస్తరణ త్వరలోనే జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. క్యాబినెట్‌లో మార్పులు, చేర్పులు ఉండే అవకాశం ఉంది. అంతేగాక, టీపీసీసీ అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తారు? కాంగ్రెస్ హైకమాండ్‌ నిర్ణయం ఏంటన్న ఉత్కంఠ నెలకొంది.

ట్రెండింగ్ వార్తలు