ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కి అభినందనలు అంటూ చంద్రబాబు ట్వీట్
Chandrababu Naidu: మంత్రులుగా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి కృషి చేస్తారని తనకు నమ్మకం ఉందని..

Chandrababu Naidu
ఆంధ్రప్రదేశ్ మంత్రులకు శాఖలు కేటాయించడంతో వారికి అభినందనలు అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కి అభినందనలు అని పేర్కొన్నారు.
మంత్రివర్గంలోని తన సహోద్యోగులందరికీ శాఖల కేటాయింపు జరిగిన సందర్భంగా వారికి అభినందనలు చెబుతున్నానని చంద్రబాబు అన్నారు. అందరం కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చేస్తూ, ప్రజా పాలన శకానికి నాంది పలుకుతామని ప్రతిజ్ఞ చేశామని తెలిపారు.
మంత్రులుగా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి కృషి చేస్తారని తనకు నమ్మకం ఉందని చంద్రబాబు నాయుడు అన్నారు. సేవ, భక్తితో కూడిన ఈ యాత్రను ప్రారంభించిన అందరికీ నా శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు. కాగా, ఆంధ్రప్రదేశ్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారికి పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. మంత్రులుగా తమకు అవకాశం ఇచ్చినందుకు ఆయా నేతలు చంద్రబాబుకు ధన్యవాదాలు చెబుతూ ట్వీట్లు చేశారు.
Congratulations to @PawanKalyan Garu on becoming the Deputy Chief Minister of Andhra Pradesh. I congratulate all my colleagues in the cabinet on being assigned their portfolios. Together, we have taken a solemn oath to serve the people of Andhra Pradesh and usher in an era of… pic.twitter.com/rpG3BnFSlv
— N Chandrababu Naidu (@ncbn) June 14, 2024
I am deeply grateful to the @BJP4India leadership and CM @ncbn Garu for their trust in me by entrusting the role of Cabinet Minister for Health, Family Welfare, and Medical Education.
This is an immense honor.
I am committed to serving the people of #Andhra with unwavering… pic.twitter.com/vUxW5zPMGm
— Satya Kumar Yadav (Modi Ka Parivar) (@satyakumar_y) June 14, 2024