స్పీకర్ పదవిపై రఘురామ కృష్ణరాజు కీలక వ్యాఖ్యలు

మంత్రి పదవి దక్కకపోవటంపైనా, స్పీకర్ పదవి వస్తుందన్న ప్రచారంపై ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు కీలక వ్యాఖ్యలు చేశారు.

స్పీకర్ పదవిపై రఘురామ కృష్ణరాజు కీలక వ్యాఖ్యలు

Raghu Rama Krishna Raju

Updated On : June 14, 2024 / 3:15 PM IST

Raghu Rama Krishna Raju : ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించారు. 24 మందికి ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దక్కాయి. ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణ రాజుకు మంత్రి పదవి దక్కుతుందని ఆశించినప్పటికీ నిరాశే ఎదురైంది. దీంతో రఘురామకు స్పీకర్ పదవి అప్పగిస్తారని ప్రచారం జరుగుతుంది. ఈ విషయంపై తాజాగా రఘురామ కృష్ణ రాజు స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.

Also Read : ఏపీ మంత్రులకు శాఖల కేటాయింపు.. పవన్ కల్యాణ్‌కు ఏ శాఖ కేటాయించారంటే..?

రఘురామ కృష్ణరాజు శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆ తరువాత తిరుపతిలో ఓ రెస్టారెంట్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఇవాళ ప్రారంభమైన జీ7 రెస్టారెంట్ లో నా పేరిట పెట్టిన ఆర్ఆర్ఆర్ ఇడ్లీని ప్రారంభించానని తెలిపారు. నాలుగున్నర సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తరువాత ఘన విజయం సాధించాం. ఎమ్మెల్సీ వ్యవస్థ వద్దు, శాసన మండలిని రద్దు చేస్తానని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి నేడు శాసనసభే కావాల్సి వచ్చింది. ఎమ్మెల్సీ వ్యవస్థను రద్దు చేయాలని చంద్రబాబు అనుకోరని రఘురామ కృష్ణరాజు అన్నారు.

Also Read : Cinematography Minister : జనసేనకే సినిమా శాఖ.. ఏపీ కొత్త సినిమాటోగ్రఫీ మినిష్టర్ ఎవరంటే..?

మంత్రి పదవి దక్కకపోవటంపైనా, స్పీకర్ పదవి వస్తుందన్న ప్రచారంపై ఆయన మాట్లాడుతూ.. స్పీకర్ పదవే కాదు.. ఏదైనా స్వీకరిస్తాను. ఇవ్వకపోయినా నాకు ఉన్న బాధ్యత నిర్వర్తిస్తానని రఘురామ కృష్ణరాజు చెప్పారు. నేను ఇచ్చిన ఫిర్యాదుపై మరో రెండు రోజులు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. లేకపోతే ఏమి చేయాలో చేస్తానని అన్నారు. ఇదిలాఉంటే.. 2021లో తనను పోలీసు కస్టడీలో చిత్రహింసలకు గురిచేశారని ఆరోపిస్తూ ఈనెల జూన్ 10వ తేదీన గుంటూరు పోలీస్ స్టేషన్ లో రఘురామ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. మాజీ సీఎం జగన్, సీఐడీ చీఫ్ పీవీ సునీల్ కుమార్, ఇతర అధికారులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.