Charlapalli Jail : ఖైదీల భార్యలపై చర్లపల్లి జైలు అధికారి కన్ను.. న్యూడ్ వీడియో కాల్ చేయాలని వేధింపులు

 జైలులో శిక్ష అనుభవించే ఖైదీలను కలవటానికి వచ్చిన వారి భార్యలపై చర్లపల్లి జైలు డిప్యూటీ సూపరింటిండెంట్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. న్యూడ్ వీడియో కాల్ మాట్లాడితేనే పెరోల్ కు సహకరిస్తానని వేధింపులకు పాల్పడుతున్నట్లుగా చింతల దశరథంపై ఆరోపణలు వచ్చాయి. ఓ ఖైదీ సోదరికి ఫోన్ చేసి వీడియో కాల్ చేస్తేనే పెరోల్ కు సహకరిస్తానంటూ వేధిస్తున్నాడని సదరు బాధితురాలు ఫిర్యాదు చేసింది. దీంతో జైళ్ల శాఖ అధికారి సదరు నిందితుడిని బదిలీ చేసింది.

Charlapalli Jail : జైలులో శిక్ష అనుభవించే ఖైదీలను కలవటానికి వారి భార్యలు..లేదా వారి బంధువులు వస్తుంటారు. అలా చర్లపల్లి జైలులో శిక్ష అనుభవించే ఖైదీలను కలవటానికి (ములాఖత్) వచ్చిన ఖైదీల భార్యలపైనా..వారి అక్కచెల్లెళ్లపై కన్నేశాడు జైలు డిప్యూటీ సూపరింటిండెంట్ చింతల దశరథం. న్యూడ్ వీడియోలతో మాట్లాడితేనే పెరోల్ కు సహకరిస్తానని వేధింపులకు పాల్పడుతున్నట్లుగా చింతల దశరథంపై ఆరోపణలు వచ్చాయి. ఓ ఖైదీ సోదరికి ఫోన్ చేసి వీడియో కాల్ చేస్తేనే పెరోల్ కు సహకరిస్తానంటూ వేధిస్తున్నాడని సదరు బాధితురాలు ఫిర్యాదు చేసింది. దీంతో డిప్యూటీ సూపరింటిండెంట్ చింతల దశరథంపై ఉన్నతాధికారులు బదిలీవేటు వేశారు. న్యూడ్ వీడియో కాల్ చేయాలని దశరథం వేధిస్తున్నాడంటూ ఓ ఖైదీ సోదరి అధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఉన్నతాధికారులు దశరథంపై బదిలీచేశారు.

నేరాలకు పాల్పడి జైలు పాలైన ఖైదీలను వారి కుటుంబ సభ్యులు కలుసుకునేందుకు జైలు అధికారులు ములాఖత్ నిర్వహిస్తుంటారు. నిర్దేశిత సమయం పాటు ఖైదీలతో వారి కుటుంబ సభ్యులు మాట్లాడేందుకు అవకాశం ఇస్తారు. ఈక్రమంలో ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్న చర్లపల్లి జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ చింతల దశరథం ములాఖత్ కు వచ్చే ఖైదీల భార్యలను..వారి సోదరీమణులను లైంగికంగా వేధిస్తున్నాడని ఫిర్యాదులు అందాయి. దశరథం తమపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడంటూ ఖైదీల భార్యలు జైళ్ల శాఖ ఉన్నతాధికారుల వద్ద గోడు వెళ్లబోసుకున్నారు.

ఈ వ్యవహారం జైళ్లశాఖ డైరెక్టర్ జనరల్ జితేందర్ వద్దకు చేరింది. దీంతో దశరథం తీరుపై తీవ్రంగా స్పందించిన జనరల్ జితేందర్ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో చర్లపల్లి జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ గా ఉన్న చింతల దశరథంను జైలు అధీనంలోని వ్యవసాయ క్షేత్రానికి బదిలీ చేశారు. కాగా..గతంలో జైల్లోని మహిళా సిబ్బందిపైనా దశరథం లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. అతడిపై కుషాయిగూడ పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదైంది. అంటే ఇవి కేవలం ఆరోపణలు కాదని వాస్తవాలని తెలుస్తోంది. కానీ ఇటువంటి అధికారులను కేవలం బదిలీ చేసినంతమాత్రాన వారి బుద్ది మారదని..ఎక్కడికి వెళ్లి డ్యూటీ చేసినా అక్కడి మహిళలను వేధిస్తుంటాడని కాబట్టి ఇటువంటివారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్స్ వస్తున్నాయి.

 

 

ట్రెండింగ్ వార్తలు