Allu Arjun : అల్లు అర్జున్ ఎమోష‌న‌ల్ పోస్ట్.. నా జీవితాన్నే మార్చేసిన మూవీ..

అల్లు అర్జున్ హీరోగా, అను మెహతా హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో వ‌చ్చిన సినిమా 'ఆర్య‌'.

Allu Arjun – Arya : అల్లు అర్జున్ హీరోగా, అను మెహతా హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో వ‌చ్చిన సినిమా ‘ఆర్య‌’. 7 మే 2004లో విడుద‌లైన ఆర్య సినిమా సృష్టించిన ప్ర‌భంజ‌నం అంతా ఇంతా కాదు. అప్పటివరకు వచ్చిన లవ్ స్టోరీలకు డిఫరెంట్ గా, ఓ ట్రైయాంగిల్ లవ్ స్టోరీతో, ఫీల్ గుడ్ పాటలతో వ‌చ్చిన ఈ మూవీ ప్రేక్షకులకు, ముఖ్యంగా యూత్ కి పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. అప్పట్లోనే 30 కోట్లు వ‌సూలు చేసి భారీ విజ‌యాన్ని అందుకుంది. నేటికి ఈ సినిమా వచ్చి నేటికి 20 ఏళ్ళు అవడం గమనార్హం.

ఈ సంద‌ర్భంగా ఆనాటి రోజుల‌ను గుర్తు చేసుకుంటూ బ‌న్ని ఎమోష‌న‌ల్ పోస్ట్ చేశాడు. ‘ఆర్యకు 20 ఏళ్లు. ఇది సినిమా మాత్ర‌మే కాదు.. నా జీవితాన్ని మార్చేసిన క్షణమది. ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటాను. స్వీట్‌ మెమొరీస్‌’ అంటూ ఆర్య సినిమా షూటింగ్‌కు సంబంధించిన కొన్ని ఫోటోల‌ను పంచుకున్నాడు.

Nikhil Siddhartha : వామ్మో నిఖిల్ సినిమాలో ఒక్క ఫైట్ కోసం అన్ని కోట్లా.. ‘స్వయంభు’ని భారీగానే ప్లాన్ చేస్తున్నారుగా..

శివ బాలాజీ, రాజన్ దేవ్, సునీల్, వేణు మాధవ్ పలువురు ముఖ్య‌పాత్ర‌ల్లో క‌నిపించ‌గా దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. దిల్ రాజ్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించారు.

రీ యూనియ‌న్‌..

కాగా.. ఆర్య మూవీ 20 ఏళ్లు పూర్తి చేసుకోవ‌డంతో మూవీ రీ యూనియ‌న్ ప్లాన్ చేసి స్పెష‌ల్ పార్టీ చేసుకోబోతున్నారు. నేడు హైదరాబాద్ లో ఆర్య మూవీ టీం, మీడియా, పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో ఆర్య 20 ఏళ్ళ సెలబ్రేషన్స్ చేసుకోబోతున్నారు. అల్లు అర్జున్, సుకుమార్, దిల్ రాజుతో పాటు ఆర్య సినిమాకి పనిచేసిన వాళ్ళు ఈ ఈవెంట్ కి హాజరు కాబోతున్నారు.

Fahadh Faasil : ‘పుష్ప’ సినిమాతో నాలో ఏ ఛేంజ్ రాలేదు.. పాన్ ఇండియా యాక్టర్ అనేది నేను నమ్మను..

ట్రెండింగ్ వార్తలు