Fahadh Faasil : ‘పుష్ప’ సినిమాతో నాలో ఏ ఛేంజ్ రాలేదు.. పాన్ ఇండియా యాక్టర్ అనేది నేను నమ్మను..
ఫహద్ ఫాజిల్ కి మంచి నటుడిగా పేరు ఉంది. ఎలాంటి పాత్ర అయినా అవలీలగా చేసేస్తాడు. అన్ని పరిశ్రమల నుంచి ఫహద్ కి భారీ ఆఫర్స్ వస్తున్నాయి.

Fahadh Faasil Interesting Comments on Pushpa Character Identity and Pan India Actor
Fahadh Faasil : మలయాళం స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ ఇప్పుడు ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. మలయాళంలో హీరోగా సినిమాలు చేస్తూనే వేరే భాషల్లో స్పెషల్ క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నాడు. వరుసగా పుష్ప, విక్రమ్, ఆవేశం.. ఇలా హిట్స్ కొడుతూ వెళ్తున్నాడు. మరోవైపు నిర్మాతగా కూడా సక్సెస్ అవుతున్నాడు. ఫహద్ ఫాజిల్ కి మంచి నటుడిగా పేరు ఉంది. ఎలాంటి పాత్ర అయినా అవలీలగా చేసేస్తాడు. అన్ని పరిశ్రమల నుంచి ఫహద్ కి భారీ ఆఫర్స్ వస్తున్నాయి.
మన తెలుగులో ముందే తెలిసినా పుష్ప సినిమాలో షెకావత్ సర్ క్యారెక్టర్ తో బాగా పాపులర్ అయ్యారు. త్వరలో పుష్ప 2 సినిమాతో కూడా రాబోతున్నారు. పుష్ప సినిమాలో ఫహద్ ఫాజిల్ క్యారెక్టర్ బాగా వైరల్ అయింది. దాంతో పాన్ ఇండియా గుర్తింపు కూడా వచ్చింది. అయితే ఫహద్ ని ఎవరు ఎంత పొగిడినా అసలు పట్టించుకోడు,. సినిమాలు చేసి వెళ్ళిపోతాడు, కనీసం తన సినిమాల గురించి కూడా ఎక్కువగా మాట్లాడడు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అందరూ సినిమాల గురించి ఎక్కువగా మాట్లాడతారు. అదొక్కటే లైఫ్ కాదు, ఎవరి పనులు వాళ్ళకి ఉన్నాయి. సినిమాల కోసం కొట్టుకుంటారు, హడావిడి చేస్తారు అంటూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. తాజాగా బాలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పుష్ప సినిమా తర్వాత మీకు పాన్ ఇండియా గుర్తింపు వచ్చింది. ఆ సినిమా మీ లైఫ్ లో చేంజ్ తెచ్చిందా అని అడిగారు.
దీనికి ఫహద్ ఫాజిల్ సమాధానమిస్తూ.. పుష్ప నన్ను ఛేంజ్ చేసింది. నన్ను డిఫరెంట్ గా చూపించింది. పాన్ ఇండియా గుర్తింపు తెచ్చింది. ఇలాంటి మాటలు వింటూనే ఉన్నాను. అవేం లేదు. నాలో పుష్ప సినిమా ఏ ఛేంజ్ తీసుకురాలేదు. పాన్ ఇండియా యాక్టర్ అనేది నేను నమ్మను. జస్ట్ నేనొక యాక్టర్. నా పని నేను చేశాను అంతే. పుష్పలో అది క్లిక్ అయింది అంటే అంతా సుకుమార్ సర్ వల్లే అని అన్నారు. దీంతో ఫహద్ ఫాజిల్ వ్యాఖ్యలు మరోసారి వైరల్ అవ్వగా మరీ ఇంత సింపుల్ గా ఎలా ఉంటావు అని అభిమానులు, నెటిజన్లు అభినందిస్తున్నారు.