Sundeep Kishan : అరే ఏంట్రా ఇది.. బట్టలు లేకుండా సందీప్ కిషన్.. సందీప్ బాడీ మీద గేమ్స్ ఆడుకుంటున్న నెటిజన్లు..

తాజాగా సందీప్ కిషన్ షర్ట్ లేకుండా ఓ ఫోటో షేర్ చేసాడు.

Sundeep Kishan : అరే ఏంట్రా ఇది.. బట్టలు లేకుండా సందీప్ కిషన్.. సందీప్ బాడీ మీద గేమ్స్ ఆడుకుంటున్న నెటిజన్లు..

Sundeep Kishan Shares Shirt less Photo Netizens Playing with Sundeep Photo

Updated On : May 7, 2024 / 8:01 AM IST

Sundeep Kishan : యువ హీరోల్లో కొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే వాళ్ళల్లో సందీప్ కిషన్ ఒకరు. ఒకప్పుడు మంచి మంచి సినిమాలతో హిట్ కొట్టిన సందీప్ కిషన్ కొన్నాళ్ళు వరుస ఫ్లాప్స్ చూసారు. ఇటీవలే ఊరుపేర భైరవకోన సినిమాతో హిట్ కొట్టి మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు సందీప్ కిషన్. త్వరలో ధనుష్ రాయన్ సినిమాతో పాటు మాయా వన్ సినిమా, ధమాకా డైరెక్టర్ త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమా చేయబోతున్నాడు.

అయితే తాజాగా సందీప్ కిషన్ షర్ట్ లేకుండా ఓ ఫోటో షేర్ చేసాడు. తన బాడీని చూపిస్తూ కింద పడుకొని దిగిన ఫోటోని తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు. మాయా వన్ సినిమా సెట్స్ నుంచి ఈ ఫోటో షేర్ చేసినట్టు తెలిపాడు. ఈ ఫోటో వైరల్ అవ్వగా పలువురు నెటిజన్స్ సందీప్ కిషన్ బాడీ మీద క్రిస్ క్రాస్ గేమ్ ఆడుతున్నారు. ఒకరి తర్వాత ఒకరు నెటిజన్స్ సందీప్ బాడీ మీద క్రాస్ మార్క్స్, సర్కిల్స్ వేస్తూ గేమ్ ఆడారు.

Also Read : Arya 20 Years : 20 ఏళ్ళ ‘ఆర్య’ రీ యూనియన్ స్పెషల్ పార్టీ.. బన్నీ, సుకుమార్, దిల్ రాజుతో సహా మూవీ యూనిట్ అంతా..

దీంతో ఇది బాగా వైరల్ అయింది. ఓ మీమర్ సందీప్ బాడీపై గేమ్ ఆడిన ఫొటోస్ అన్ని స్క్రోల్ చేస్తూ వీడియో తీసి షేర్ చేయగా సందీప్ కూడా దాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసి చాలా ఫన్నీగా ఉంది అంటూ కామెంట్ చేశారు. మొత్తానికి సందీప్ షర్ట్ లేకుండా షేర్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.