Nikhil Siddhartha : వామ్మో నిఖిల్ సినిమాలో ఒక్క ఫైట్ కోసం అన్ని కోట్లా.. ‘స్వయంభు’ని భారీగానే ప్లాన్ చేస్తున్నారుగా..

స్వయంభు సినిమాలోని ఓ భారీ యాక్షన్ సీన్ ని తెరకెక్కిస్తున్నారు. ఈ సీన్ కోసం వరల్డ్ బెస్ట్ టెక్నీషియన్స్ ని తెప్పించారని నిఖిల్ స్వయంగా ఓ పోస్టర్ షేర్ చేసి తెలిపాడు. 

Nikhil Siddhartha : వామ్మో నిఖిల్ సినిమాలో ఒక్క ఫైట్ కోసం అన్ని కోట్లా.. ‘స్వయంభు’ని భారీగానే ప్లాన్ చేస్తున్నారుగా..

Nikhil Swayambhu Movie Action Scene Shooting with Huge Budget

Nikhil Siddhartha : నిఖిల్ కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకోవడంతో ఇప్పుడు వరుస భారీ సినిమాలను లైన్లో పెట్టాడు. నిఖిల్ ప్రస్తుతం ‘స్వయంభు’ సినిమా షూట్ తో బిజీగా ఉన్నాడు. ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియో నిర్మాణంలో భువన్, శంకర్ నిర్మాతలుగా భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో ఈ స్వయంభు సినిమా తెరకెక్కుతుంది. సంయుక్త, నభా నటేష్ లు హీరోయిన్స్ గా ఈ సినిమాలో నటిస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్ సినిమాగా తెరకెక్కుతున్న స్వయంభులో నిఖిల్ ఓ లెజెండరీ యోధుడిగా కనిపించబోతున్నాడు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్, మేకింగ్ వీడియోస్ తో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి ఓ అధికారిక సమాచారం రిలీజ్ చేశారు. ప్రస్తుతం స్వయంభు సినిమాలోని ఓ భారీ యాక్షన్ సీన్ ని తెరకెక్కిస్తున్నారు. ఈ సీన్ కోసం వరల్డ్ బెస్ట్ టెక్నీషియన్స్ ని తెప్పించారని నిఖిల్ స్వయంగా ఓ పోస్టర్ షేర్ చేసి తెలిపాడు.

Also Read : Alia Bhatt : అలియా భట్ ఒక్క డ్రెస్ కోసం ఏకంగా 163 మంది.. 1905 గంటలు పనిచేశారట.. వైరల్ అవుతున్న ఫొటోలు..

12 రోజుల పాటు దాదాపు 700 మందితో ఏకంగా 8 కోట్లు పెట్టి ఈ యాక్షన్ సీన్ భారీగా తెరకెక్కిస్తున్నారట. దీంతో నిఖిల్ సినిమాకి 8 కోట్లు పెట్టి భారీ యాక్షన్ సీన్ చేస్తున్నారంటే ఇక స్వయంభు మొత్తం బడ్జెట్ ఎంతో అని ఆశ్చర్యపోతున్నారు. సినిమాపై మాత్రం ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారట. ఇది కూడా కార్తికేయ 2కి మించి హిట్ అయి నిఖిల్ ని పాన్ ఇండియా స్టార్ గా నిలబెడుతుంది భావిస్తున్నారు. ఈ సినిమా కోసం నిఖిల్ కత్తిసాము, గుర్రపు స్వారీ, కర్ర సాము.. లాంటివి నేర్చుకొని కష్టపడుతున్నాడు. ఒకప్పుడు 8 కోట్ల బడ్జెట్ లో సినిమాలు చేసిన నిఖిల్ ఇప్పుడు సినిమాలో ఒక్క యాక్షన్ సీన్ కి 8 కోట్లు ఖర్చుపెడుతున్నాడంటే చాలా ఎదిగాడు అంటూ అభినందిస్తున్నారు.