Genelia : ఆహా సింగింగ్ షో కోసం వచ్చిన ‘హాసిని’.. జెనీలియా క్యూట్ ఎపిసోడ్ ప్రొమో వచ్చేసింది..
తెలుగు ఇండియన్ ఐడల్ నాలుగో సీజన్ కి సంబంధించిన ఎపిసోడ్స్ ఆహా ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్నాయి.(Genelia)

Telugu Indian Idol S4 Promo Grand Premiere With Genelia
Genelia : ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా.. సరికొత్త సినిమాలు, ఆకట్టుకునే వెబ్ సిరీస్‌లు, అదిరిపోయే గేమ్ షోలతో ప్రేక్షకులను అలరిస్తోంది. సింగింగ్ టాలెంట్ ఉండి నిరూపించుకునేందుకు అవకాశం కోసం ఎదురుచూస్తున్న గాయనీగాయకుల కోసం తెలుగు ఇండియన్ ఐడల్ షోను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే విజయవంతంగా మూడు సీజన్లు పూర్తి చేసుకుంది. నాలుగో సీజన్ ఇటీవలే ప్రారంభమైంది.
ఓ ఎపిసోడ్‌కు హీరోయిన్ జెనీలియా (Genelia) అతిథిగా వచ్చింది. ఇందుకు సంబంధించిన ప్రొమోను తాజాగా విడుదల చేశారు. తమ పాటలతో సింగర్స్ జెనీలియా మెప్పించారు. ఇక జెనీలియా తనదైన మాటలతో అలరించింది. మొత్తంగా ప్రొమో అదిరిపోయింది.
ఈ సంగీత కార్యక్రమానికి ప్రముఖ సంగీత దర్శకులు తమన్, సింగర్స్.. కార్తీక్, గీతా మాధురి జడ్జెస్ గా అలాగే శ్రీరామచంద్ర హోస్ట్ గా, సమీరా భరద్వాజ్ కో హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ప్రతి శుక్రవారం, శనివారం సాయంత్రం 7 గంటలకు ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది.