Niharika konidela : సైమా 2025లో రెండు అవార్డులతో సత్తాచాటిన ‘కమిటీ కుర్రోళ్లు’.. బెస్ట్ డెబ్యూ ప్రొడ్యూసర్ గా నిహారిక కొణిదెల
నటి, నిర్మాత నిహారిక కొణిదెల(Niharika konidela)కు సినిమా పట్ల ఉండే అభిరుచి అందరికీ తెలిసిందే.

SIIMA 2025 Niharika konidela won the best debut producer award for committee kurrollu
Niharika konidela : మెగా డాటర్ నిహారిక కొణిదెల పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, శ్రీ రాధ దామోదర్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన సినిమా కమిటీ కుర్రోళ్ళు. థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించింది. 9 కోట్ల బడ్జెట్‌తో రూపొందించగా థ్రియేట్రికల్ గా రూ.18.5 కోట్లు వసూళ్లను రాబట్టింది. ఇక నాన్ థియేట్రికల్ బిజినెస్ రూ.6 కోట్లు జరిగింది. మొత్తంగా రూ.24.5 కోట్ల వసూళ్లను సాధించింది.
ఈ చిత్రం ఇప్పటికే అనేక వేదికపై అవార్డులను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు సైమా 2025 వేడుకల్లోనూ ‘కమిటీ కుర్రోళ్లు’ సత్తా చాటింది. బెస్ట్ డెబ్యూ ప్రొడ్యూసర్‌గా నిహారిక కొణిదెల(Niharika konidela )కు, బెస్ట్ డెబ్యూ యాక్టర్ గా సందీప్ సరోజ్ కి సైమా అవార్డు వచ్చింది. నిర్మాతగా తొలి ఫీచర్ ఫిల్మ్‌తోనే నిహారిక టాలీవుడ్‌లో ఓ హిస్టరీని క్రియేట్ చేసినట్టు అయింది.
Bigg Boss Telugu 9 : బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ లాంచ్ ప్రొమో.. అదిరిపోయిన బిగ్‌బాస్ హౌస్..
View this post on Instagram
ఇంతకముందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ కు అవార్డుల పంట పడింది. ఈ చిత్రానికి జాతీయ సమైక్యత, మత సామరస్యం, అణగారిన వర్గాల సామాజిక అభ్యున్నతిపై తీసిన ఉత్తమ ఫీచర్ ఫిల్మ్‌గా, దర్శకుడు యధు వంశీకి ఉత్తమ తొలి దర్శకుడిగా అవార్డులు లభించాయి. గామా అవార్డుల్లోనూ సత్తా చాటింది. బెస్ట్ డెబ్యూ ప్రొడ్యూసర్‌గా నిహారిక కొణిదెలకు, బెస్ట్ డెబ్యూ డైరెక్టర్‌గా యదు వంశీకి గామా అవార్డులు వచ్చాయి.