OG BGM : పవన్ ‘ఓజీ’ కోసం జపనీస్ వాద్య పరికరం.. తమన్ క్రియేట్ చేసిన బీజీఎం ఇదేనా!
తమన్ ఓజీ నేపథ్య సంగీతాన్ని (OG BGM)సమకూర్చే పనిలో బిజీగా ఉన్నాడు. ఇందుకోసం జపాన్ వాద్య పరికరం కోటోను ఉపయోగిస్తున్నారు.

Thaman shares OG movie BGM
OG BGM : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రం ఓజీ. సుజీత్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పై ఈ చిత్రం నిర్మిమితమవుతోంది. ప్రియాంక మోహన్ కథానాయిక.
ఇప్పటికే చిత్రీకరణ పూర్తి కాగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. తమన్ నేపథ్య సంగీతాన్ని సమకూర్చే పనిలో బిజీగా ఉన్నాడు. ఇందుకోసం జపాన్ వాద్య పరికరం కోటోను ఉపయోగిస్తున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తమన్ వెల్లడించాడు. కోటోను ఉపయోగించి బీజీఎం (OG BGM) క్రియేట్ చేసినట్లుగా చెప్పుకొచ్చాడు. ఈ మేరకు ఓ వీడియోను అభిమానులతో పంచుకున్నాడు.
#OgBgm
This instrument is calked Japanese ( koto )
Just tried With A violin Bow 🖤
Sounded this way 🤪🤯 pic.twitter.com/4xI3VE9Yyv— thaman S (@MusicThaman) September 6, 2025
ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి విలన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. శ్రియారెడ్డి, ప్రకాశ్‌రాజ్, అర్జున్‌దాస్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. సెప్టెంబర్ 25న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.