Thaman shares OG movie BGM
OG BGM : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రం ఓజీ. సుజీత్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పై ఈ చిత్రం నిర్మిమితమవుతోంది. ప్రియాంక మోహన్ కథానాయిక.
ఇప్పటికే చిత్రీకరణ పూర్తి కాగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. తమన్ నేపథ్య సంగీతాన్ని సమకూర్చే పనిలో బిజీగా ఉన్నాడు. ఇందుకోసం జపాన్ వాద్య పరికరం కోటోను ఉపయోగిస్తున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తమన్ వెల్లడించాడు. కోటోను ఉపయోగించి బీజీఎం (OG BGM) క్రియేట్ చేసినట్లుగా చెప్పుకొచ్చాడు. ఈ మేరకు ఓ వీడియోను అభిమానులతో పంచుకున్నాడు.
#OgBgm
This instrument is calked Japanese ( koto )
Just tried With A violin Bow 🖤
Sounded this way 🤪🤯 pic.twitter.com/4xI3VE9Yyv— thaman S (@MusicThaman) September 6, 2025
ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి విలన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. శ్రియారెడ్డి, ప్రకాశ్‌రాజ్, అర్జున్‌దాస్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. సెప్టెంబర్ 25న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.