SIIMA Awards 2025 : సైమా అవార్డ్స్ 2025 విజేత‌లు.. ఉత్త‌మ న‌టుడిగా అల్లు అర్జున్‌.. ఉత్త‌మ మూవీ ఏదంటే?

ఇంట‌ర్నేష‌న‌ల్ మూవీ అవార్డ్స్ (SIIMA Awards 2025) వేడుక దుబాయ్ వేదిక‌గా జ‌రిగింది. ఉత్త‌మ న‌టుడిగా అల్లు అర్జున్ అవార్డును సొంతం చేసుకున్నారు.

SIIMA Awards 2025 : సైమా అవార్డ్స్ 2025 విజేత‌లు.. ఉత్త‌మ న‌టుడిగా అల్లు అర్జున్‌.. ఉత్త‌మ మూవీ ఏదంటే?

SIIMA Awards 2025 list of winners BEST Actor Leading Male Allu Arjun

Updated On : September 6, 2025 / 10:44 AM IST

IIMA Awards 2025 : ప్రతిష్ఠాత్మక సౌత్ ఇండియన్ ఇంట‌ర్నేష‌న‌ల్ మూవీ అవార్డ్స్ (సైమా) వేడుక దుబాయ్ వేదిక‌గా అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగాయి. తొలి రోజు క‌న్న‌డ‌, తెలుగు మూవీల్లో ప్ర‌తిభ క‌న‌బ‌ర్చిన న‌టీన‌టులు అవార్డ్స్ (SIIMA Awards 2025)సొంతం చేసుకున్నారు. 2024లో విశేష ప్ర‌తిభ క‌న‌బ‌రిచిన న‌టీన‌టులు, చిత్రాలకు అవార్డులు అందించారు.

ప్ర‌భాస్ హీరోగా నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన సైన్స్ ఫిక్ష‌న్ మూవీ క‌ల్కి 2898 ఏడీ ఉత్త‌మ చిత్రంగా నిలిచింది. ఉత్త‌మ న‌టుడిగా అల్లు అర్జున్‌, ఉత్త‌మ న‌టిగా ర‌ష్మిక మంధాన, ఉత్త‌మ ద‌ర్శ‌కుడిగా సుకుమార్ అవార్డులు సొంతం చేసుకున్నారు.

Geeta Singh : సూసైడ్ అటెంప్ట్ చేశాను.. ఇండస్ట్రీ వాళ్ళే.. 22 లక్షలు మోసం చేసి..

సైమా 2025 అవార్డులు(తెలుగు)..

* ఉత్తమ చిత్రం – కల్కి 2898 ఏడీ

* ఉత్తమ నటుడు – అల్లు అర్జున్ (పుష్ప‌2)

* ఉత్తమ నటి – రష్మిక మందన్నా (పుష్ప‌2)

* ఉత్తమ దర్శకుడు – సుకుమార్ (పుష్ప‌2)

* ఉత్తమ నటుడు (క్రిటిక్స్) – తేజ సజ్జా (హ‌నుమాన్‌)

* ఉత్తమ నటి (క్రిటిక్స్) – మీనాక్షి చౌదరి (ల‌క్కీ భాస్క‌ర్‌)

* ఉత్తమ దర్శకుడు (క్రిటిక్స్) – ప్రశాంత్ వర్మ (హ‌నుమాన్‌)

* ఉత్తమ సహాయ నటుడు – అమితాబ్ బచ్చన్ (కల్కి 2898 ఏడీ)

* ఉత్తమ సహాయ నటి – అన్నే బెన్ (కల్కి 2898 ఏడీ)

* ఉత్తమ సంగీత దర్శకుడు – దేవి శ్రీ ప్రసాద్ (పుష్ప‌2)

* ఉత్తమ గీతరచయిత – రామ్ జోగయ్య శాస్త్రి (చుట్ట‌మ‌ల్లే)

* ఉత్తమ గాయకుడు – శంకర్ బాబు కందుకూరి

* ఉత్తమ గాయని – శిల్పా రావు (చుట్ట‌మ‌ల్లే)

* ఉత్తమ విల‌న్‌ – కమల్ హాసన్ (కల్కి 2898 ఏడీ)

* ఉత్తమ పరిచయ నటి – భాగ్యశ్రీ బోర్సే (మిస్ట‌ర్ బ‌చ్చ‌న్‌)

* ఉత్తమ పరిచయ నటుడు – సందీప్ సరోజ్

* ఉత్తమ పరిచయ దర్శకుడు – నంద కిషోర్ యేమని

* ఉత్తమ కొత్త నిర్మాత – నిహారిక కొణిదెల (కమిటీ కుర్రోళ్లు)

* ఉత్తమ సినిమాటోగ్రాఫర్ – రత్నవేలు (దేవ‌ర‌)

* ఉత్తమ హాస్యనటుడు – సత్య (మత్తు వదలరా 2)

* ప్రైడ్‌ ఆఫ్‌ తెలుగు సినిమా – అశ్వినీదత్ (వైజయంతీ మూవీస్‌)