ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు షాక్

కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని కూడా రౌస్ అవెన్యూ కోర్టు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. ఆమె మే 14 వరకు కస్టడీలోనే ఉండనున్నారు. కవిత అడిగిన 10 పుస్తకాలను కోర్టు అనుమతించింది. లాకప్‌లో ఇంటి భోజనం ఇచ్చే అంశంపై లాకప్ ఇన్‌చార్జ్ నిర్ణయం తీసుకుంటారని జడ్జి కావేరి భవేజా తెలిపారు.

ఏడు రోజుల్లో కవితపై చార్జ్‌షీట్ దాఖలు చేయనుంది ఈడీ. ఈ విషయాన్ని కోర్టుకు ఈడీ తెలిపింది. ఈడీ కేసులో కవిత పాత్ర కేసు దర్యాప్తు అంశాలను చార్జ్‌షీట్లో ప్రస్తావించనుంది. మార్చి 15న కవితను ఈడీ అరెస్ట్ చేసిన విషయం విదితమే.

కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని కూడా రౌస్ అవెన్యూ కోర్టు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆయన మే 20 వరకు కస్టడీలోనే ఉండనున్నారు. కేసు దర్యాప్తు పురోగతిలో ఉందని జ్యుడిషియల్ కస్టడీ పొడిగించాలని కోర్టును కోరింది ఈడీ. దీంతో ఆయన మరో 13 రోజులు కస్టడీలోనే ఉంటారు.

ఎన్నికల వేళ కూడా ఆయా నేతలకు ఊరట దక్కకపోవడం గమనార్హం. దేశంలో ఇప్పటికే మూడు దశల్లో ఎన్నికలు జరిగాయి. వచ్చేనెల 4న ఫలితాలు వెల్లడికానున్నాయి. నేతలను కేంద్ర సర్కారు ఈడీతో వేధిస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

 Also Read: చంద్రబాబు పేరెత్తడానికే అసహ్యంగా ఉంది.. మోదీ ప్రధాని పదవికి విలువ లేకుండా చేస్తున్నారు : మంత్రి బొత్స

ట్రెండింగ్ వార్తలు