Sri Venkateswara Swamy Kalyana : మేళ్ళచెరువు మహాసిమెంట్ ప్రాంగణంలో వైభవంగా శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు
Sri Venkateswara Swamy Kalyana : మేళ్ళచెరువు మహా సిమెంట్స్ ప్రాంగణంలో శ్రీదేవీ భూదేవీ సమేత శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.
Sri Venkateswara Swamy Kalyana
Sri Venkateswara Swamy Kalyana : మేళ్ళచెరువు మహా సిమెంట్స్ ప్రాంగణంలో శ్రీదేవీ భూదేవీ సమేత శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. గురువారం స్వామి, అమ్మవార్ల తిరు కళ్యాణ మహోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి వారి పర్యవేక్షణలో కన్నుల పండువగా కళ్యాణ తంతు కొనసాగుతోంది. స్వామి, అమ్మవార్లకు మై హోమ్ ఇండస్ట్రీస్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు, శ్రీకుమారి దంపతులు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. ఈ కల్యాణ కార్యక్రమంలో అహోబిలం జీయర్ స్వామి, దేవానంద్ జీయర్ స్వామి, మై హోమ్ గ్రూప్ సంస్థల డైరెక్టర్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
