Balapur Ganesh Laddu Auction 2026 : బాలాపూర్ లడ్డూ వేలంలో సరికొత్త రికార్డు నమోదు.. ఏ సంవత్సరం ఎంత ధర పలికిందంటే?
Balapur Ganesh Laddu Auction 2026 : గణేశ్ నవరాత్రి ఉత్సవాల్లో బాలాపూర్ గణేశుడి లడ్డూకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. ప్రతీయేటా వేలం పాటలో లడ్డూకు రికార్డు స్థాయి ధర పలుకుతుంది. ఈసారి కూడా సరికొత్త రికార్డును నమోదు చేసింది.
Balapur Ganesh Laddu Auction 2026
Balapur Ganesh Laddu Auction 2026 : గణేశ్ నవరాత్రి ఉత్సవాల్లో బాలాపూర్ గణేశుడి లడ్డూకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ స్వామివారికి సమర్పించే లడ్డూ ప్రసాదానికి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ గుర్తింపు ఉంది. ఘన చరిత్ర కలిగిన బాలాపూర్ వినాయకుడి లడ్డూను వేలంలో దక్కించుకునేందుకు భక్తులు ప్రతీయేటా పోటీ పడుతున్నారు. గత ఏడాది లడ్డూను లింగాల దశరథ్ గౌడ్ రూ.35లక్షలకు దక్కించుకున్నారు. ఈసారి కూడా లడ్డూను దక్కించుకునేందుకు అనేక మంది పోటీ పడ్డారు. చివరకు సామా ప్రణీత్ రెడ్డి రూ.39లక్షలకు బాలాపూర్ లడ్డూను వేలంలో దక్కించుకున్నారు.
వేలంలో లడ్డూ ధర ఏ సంవత్సరం ఎంతంటే?
♦ 1994లో రూ.450
♦ 1995లో రూ. 4,500
♦ 1996లో రూ.18వేలు
♦ 1997లో రూ.28వేలు
♦ 1998లో రూ.51వేలు
♦ 1999లో రూ.65వేలు
♦ 2000లో రూ.66వేలు
♦ 2001లో రూ.85వేలు
♦ 2002లో రూ.1.05 లక్షలు
♦ 2003లో రూ.1.55లక్షలు
♦ 2004లో రూ.2.01 లక్షలు
♦ 2005లో రూ.2.08లక్షలు
♦ 2006లో రూ.3లక్షలు
♦ 2007లో రూ.4.15లక్షలు
♦ 2008లో రూ.5.07లక్షలు
♦ 2009లో రూ.5.10లక్షలు
♦ 2010లో రూ.5.35లక్షలు
♦ 2011లో రూ.5.45లక్షలు
♦ 2012లో రూ.7.50లక్షలు
♦ 2013లో రూ.9.26లక్షలు
♦ 2014లో రూ. 9.5లక్షలు
♦ 2015లో రూ.10.32లక్షలు
♦ 2016లో రూ.14.65లక్షలు
♦ 2017లో రూ.15.60లక్షలు
♦ 2018లో రూ.16.60లక్షలు
♦ 2019లో రూ.17.60లక్షలు
♦ 2020లో కరోనా కారణంగా వేలం రద్దు
♦ 2021లో రూ.18.90లక్షలు
♦ 2022లో రూ.24.60లక్షలు
♦ 2023లో రూ. 27లక్షలు
♦ 2024లో రూ. 30.1లక్షలు
♦ 2025లో రూ. 35లక్షలు
♦ 2026లో రూ. 39లక్షలు
