స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ ఇక వేసవి సెలవుల తర్వాతే..

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని ఏపీ సర్కారు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది. వేసవి సెలవుల తర్వాత విచారిస్తామని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్ మిత్తల్ ధర్మాసనం స్పష్టం చేసింది.

కోర్టు వేసవి సెలవుల తర్వాత వెంటనే చేపట్టాల్సిన అవసరం లేదని కూడా ధర్మాసనం స్పష్టం చేసింది. 10 వారాల తర్వాతే విచారణ చేపడుతామని సుప్రీంకోర్టు తెలిపింది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని ఏపీ సర్కారు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. 17ఏ అంశంపై ముగ్గురు జడ్జీల ధర్మాసనం నిర్ణయం తర్వాత దాన్ని పరిశీలిస్తామని జస్టిస్ బేలా త్రివేది అన్నారు.

వేసవి సెలవుల తర్వాత సీజేఐ ముందు మెన్షన్ చేయనున్నట్లు సీఐడీ తరపు న్యాయవాది తెలిపారు. 17ఏ అంశంతో సంబంధం లేకుండానే రాష్ట్ర హైకోర్టు బెయిల్ మంజూరు చేసిందని కోర్టుకు చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్దార్థ లూత్ర చెప్పారు. ఈ కేసులో ఇప్పటికే చార్జిషీట్ దాఖలు చేశారని, ట్రయల్ కోర్టు ఇంకా పరిగణనలోకి తీసుకోలేదని లూత్ర అన్నారు. 17ఏ కింద అనుమతి తీసుకోలేదన్న కారణంగా చార్జిషీట్ ఇంకా పరిగణనలోకి తీసుకోలేదని లూత్ర తెలిపారు.

Also Read: ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. రేవంత్ రెడ్డి సభ కోసం వేసిన టెంట్లు కూలిన వైనం

ట్రెండింగ్ వార్తలు