ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. రేవంత్ రెడ్డి సభ కోసం వేసిన టెంట్లు కూలిన వైనం

Rains: హైదరాబాద్, భూపాలపల్లి, కామారెడ్డి, మెదక్, మేడ్చల్ మల్కాజ్ గిరి..

ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. రేవంత్ రెడ్డి సభ కోసం వేసిన టెంట్లు కూలిన వైనం

Rains In TG Andhra Pradesh Weather Update

తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కరీంనగర్ ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాల మైదానంలో రేవంత్ రెడ్డి సభ కోసం వేసిన టెంట్లు ఈదురుగాలుల వల్ల కూలిపోయాయి. అవి చెల్లాచెదురైపడ్డాయి. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.

కరీంనగర్ లో వాతావరణం మారిపోయింది. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేములవాడలోనూ వర్షం కురుస్తోంది.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం సబ్ డివిజన్ మహాదేవపూర్, మహ ముత్తారం, పలిమల, మల్హర్ మండలాల్లో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షం పడుతోంది. హైదరాబాద్, భూపాలపల్లి, కామారెడ్డి, మెదక్, మేడ్చల్ మల్కాజ్ గిరి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి సిద్దిపేట జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావారణ శాఖ అధికారులు ఇప్పటికే తెలిపారు.

హైదరాబాద్‌ కూల్..
హైదరాబాద్‌లో వాతావరణం మారింది. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఎండల వేడితో ఇబ్బందులు పడ్డ ప్రజలు ఉపశమనం పొందుతున్నారు. అలాగే, మేడ్చల్ జిల్లా బోడుప్పల్, మేడిపల్లి, పీర్జాదిగూడ పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.

ఏపీలో వర్షాలు
ఏపీలోని పలు ప్రాంతాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి శ్రీకాకుళంతో పాటు విశాఖపట్నం, గుంటూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పింది.

Also Read: అలాంటి వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయొద్దు: ఈసీ