Karnataka Congress CM: సిద్ధరామయ్య, శివకుమార్‌లలో సీఎం ఎవరు..? అదిరిపోయే ప్లాన్‌లో కాంగ్రెస్.. బెంగళూరుకు రేవంత్ రెడ్డి

కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రి ఎవరనే విషయమై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శనివారం పలు దఫాలుగా చర్చలు జరిపారు. అయితే ..

Karnataka Elections Result: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన విషయం విధితమే. 135 నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. ఇంతటి భారీ విజయం సాధించడంలో మాజీ సీఎం సిద్ధ రామయ్య, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు డీకే శివకుమార్‌లు కీలక భూమిక పోషించారని చెప్పొచ్చు. గెలుపు విజయాల్లో కాంగ్రెస్ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్న తరుణంలో సిద్ధ రామయ్య, డీకే శివకుమార్ లలో సీఎం అభ్యర్థి ఎవరనేది కర్ణాటకలోనే కాకుండా దేశవ్యాప్తంగా చర్చనియాంశంగా మారింది. ఇద్దరు సీఎం పదవిని కోరుకుంటున్నారు. ఈ క్రమంలో వీరిద్దరిలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎవరికి సీఎం పదవి అప్పగిస్తుందనేది ఆసక్తికర అంశంగా మారింది. ఈ అంశంపై స్పష్టత ఇచ్చేందుకు ఆదివారం సాయంత్రం బెంగళూరులో సీల్పీ భేటీ జరగనుంది. ఈ భేటీలో సీఎం అభ్యర్థి ఎవరనేది నిర్ణయించే అవకాశాలు ఉన్నారు.

Karnataka Elections Result: రాహుల్ గాంధీ ‘జోడో యాత్ర ’ సాగిన నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎన్నిచోట్ల గెలిచిందో తెలుసా?

బెంగళూరుకు ఎమ్మెల్యేలు..

కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ భారీ విజయాన్ని సాధించింది. ఆ పార్టీ నుంచి 135 మంది అభ్యర్థులు విజయం సాధించారు. వారంతా బెంగళూరుకు రావాలని పార్టీ అధిష్టానం సూచించింది. ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు బెంగళూరు చేరుకోగా.. సాయంత్రం సమయానికి మిగిలిన ఎమ్మెల్యేలు బెంగళూరు వెళ్లనున్నారు. సాయంత్రం 5.30 గంటలకు బెంగళూరులో కాంగ్రెస్ తొలి సీల్పీ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో సీఎం అభ్యర్థిని ఎంపిక చేయనున్నారు. డీకే శివకుమార్, సిద్ధ రామయ్య సీఎం అభ్యర్థి బరిలో ఉన్నారు. సిద్ధ రామయ్యకు అనుకూలంగా పార్టీ అధిష్టానం నుంచి సానుకూలత వ్యక్తమవుతున్నప్పటికీ.. పార్టీలోని ప్రధాన వర్గం ఎమ్మెల్యేలు డీకే శివకుమార్ కు సీఎం పదవి అప్పగించాలని అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బెంగళూరులో జరిగే సమావేశంలో ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకున్న తర్వాతే పార్టీ అధిష్టానం సీఎం అభ్యర్థి విషయంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Karnataka Election Result 2023: కర్ణాటకలో ప్రాంతాల వారీగా ఫలితాలు ఇలా.. 2018లో ఎన్ని? 2023లో ఎన్ని?

చెరో రెండున్నరేళ్లు..?

కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రి ఎవరనే విషయమై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శనివారం పలు దఫాలుగా చర్చలు జరిపారు. అయితే, ఇవే నా చివరి ఎన్నికలని సిద్ధ రామయ్య ఇప్పటికే ప్రకటించడంతో పాటు, ఆయనకు కర్ణాటకలో ప్రజాదరణ కలిగి ఉండటాన్ని దృష్టిలో ఉంచుకొని సీఎం పదవి అప్పగించే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉంది. కానీ, డీకే శివకుమార్ పదనైన రాజకీయ వ్యూహాలు అమలు చేయడంలో దిట్ట. 2024 లోక్ సభ ఎన్నికలకు శివకుమార్ కీలకమైన వ్యక్తి అని అధిష్టానం భావిస్తుంది. ఈ క్రమంలో భవిష్యత్ రాజకీయాలు, ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని సీఎం ఎంపికపై కాంగ్రెస్ అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తోంది. సీఎం అభ్యర్థి ఎంపిక విషయంలో.. రెండు మార్గాలను అధిష్టానం ఎంచుకొనుందని సమాచారం. సిద్ధ రామయ్యకు సీఎం పదవి అప్పగిస్తే శివకుమార్‌కు కీలక పదవి అప్పగించాలని యోచిస్తుంది. అలాకాకుంటే సిద్ధ రామయ్య, డీకే శివకుమార్ లకు చెరో రెండున్నరేళ్లు సీఎం పదవి ఇచ్చే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు సమాచారం.

Hindu Ekta Yatra: లక్ష మందితో హిందూ ఏక్తాయాత్ర.. ముఖ్యఅతిథులుగా వచ్చేది ఎవరో తెలుసా?

బెంగళూరుకు రేవంత్ రెడ్డి..

కర్ణాటక‌లో కాంగ్రెస్ గ్రాండ్ విక్టరీ సాధించింది. ఆదివారం సీఎల్పీ నేతను కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. బెంగళూరులో మధ్యాహ్నం కాంగ్రెస్ శాసనసభ పక్షనేత ఎంపిక సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. ఈ మేరకు ఆదివారం తన నివాసం నుంచి బెంగళూరుకు రేవంత్ రెడ్డి బయలుదేరి వెళ్లారు.

ట్రెండింగ్ వార్తలు