Minister Not wearing mask: ‘మాస్కు’ ధరించడం తప్పనిసరేం కాదు.. అది వ్యక్తిగత నిర్ణయం: కర్ణాటక మంత్రి

'మాస్కు’ధరించం తప్పనిసరేం కాదు..అది వ్యక్తిగత నిర్ణయం..ఇష్టముంటే పెట్టుకోండీ అది మీ ఇష్టం..అంటూ వ్యాఖ్యానించారు బీజేపీ మంత్రి.

Karnataka Minister not wearing mask: కోవిడ్ మహమ్మారికి కొత్త కొత్త్ వేరియంట్లుగా మారి కలవరపెడుతోంది మాస్కులు పెట్టుకోవాల్సిందేనని డాక్టర్లు, నిపుణులు, ప్రభుత్వాలు గగ్గోలు పెడుతున్నాయి. కానీ కర్ణాటకకు చెందిన ఓ మంత్రి ఉమేశ్ కత్తి మాత్రం ‘మాస్క్ ధరించటం తప్పనిసరి ఏమీ కాదు..ఇది వ్యక్తిగత నిర్ణయం..ఇష్టమైనవారు పెట్టుకోండీ’ అంటూ సలహాలిచ్చారు. ‘నా మట్టుకు నాకు మాస్క్ ధరించటం ఇష్టం లేదు..అందుకే పెట్టుకోను అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాదు ఓ కార్యక్రమంలో పాల్గొనటానికి వచ్చిన సదరు మంత్రిగారు మాస్కు ధరించకుండానే జనాల్లో కులాసాగా తిరిగేశారు. పైగా మాస్కు ధరించడం తప్పనిసరేం కాదని..అది వారి వారి వ్యక్తిగతమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీనే ఈ మాట చెప్పారంటూ చెప్పుకొచ్చారు.

Also Read : Covid-19 Victims: ఆంధ్ర, బీహార్ రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు సుప్రీం కోర్టు సమన్లు

మాస్కు ధరిస్తే కరోనా సోకే అవకాశాలు తక్కువని..కాబట్టి ప్రతీ ఒక్కరు మాస్కు ధరించాల్సిందేనని లేదంటే జరిమానాలు తప్పవని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. కానీ కర్ణాటకకు మంత్రి ఉమేశ్ కత్తి మాత్రం మాస్కు లేకుండా బహిరంగ ప్రదేశాల్లో చక్కగా తిరిగేశారు. ‘‘సార్ మాస్క్ పెట్టుకోలేదు’’ అంటూ కొంతమంది గుసగుసలాడిని ఆయనకు చెప్పటానికి భయపడ్డారు. అటవీ శాఖ నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరైన మంత్రి ఉమేష్ కత్తి మాస్కు పెట్టుకోకపోవటంతో మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు.

దానికి మంత్రి ‘మాస్కు ధరించటం తప్పనిసరి ఏమీ కాదు. అది వ్యక్తిగత నిర్ణయం ఇష్టముంటే ధరించండీ లేకుంటే లేదు..నాకు మాస్కు ధరించటం ఇష్టంలేదు..అందుకే ధరించలేదు’’అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాదు..తాను చేసిన పనిని సమర్థించుకోవటానికి మంత్రి ప్రధానమంత్రి మోదీ పేరును వాడేసుకుంటూ..మాస్కు తప్పనిసరేం కాదని మోడీయే చెప్పారని అన్నారు.

Also Read : 5G effect on flights: విమానాలకు తలనొప్పిగా మారిన 5G సేవలు

‘మాస్కు ధరించాలని ఎవ్వరిపైనా ఆంక్షలు ఉండవని మోదీ చెప్పారు. మాస్కు ధరించడం వ్యక్తిగత బాధ్యత. ఇది వ్యక్తుల విచక్షణ మీదే ఆధారపడి ఉంటుంది. నాకు మాస్కు పెట్టుకోవాలని అనిపించలేదు అందుకే ధరించలేదు’ అంటూ చెప్పుకొచ్చారు.

కాగా కర్ణాటకలో కరోనా కేసులు భారీగానే ఉన్నాయి. మంగళవారం (జనవరి 18,2022) ఏకంగా 41 వేలకు పైగా కేసులు వెలుగులోకి వచ్చాయి. ఒక్క బెంగళూరులోనే 25,595 కేసులు నమోదయ్యాయి. ఫలితంగా పాజిటివిటీ రేటు 22.30 శాతానికి పెరిగింది. ఇలాంటి సమయంలో మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి మాస్కుపై నిర్లక్ష్యంగా మాట్లాడటం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాధ్యతగల పదవిలో ఉండి ఇటువంటి వ్యాఖ్యలేంటీ అంటున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు