Arvind Kejriwal: గుజరాత్‌లో అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్: అరవింద్ కేజ్రీవాల్

అహ్మదాబాద్‌లో ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుజరాత్ ఓటర్లకు పలు హామీలు ఇచ్చారు. ‘‘ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఉచిత విద్యుత్ అందిస్తాం. రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ టారిఫ్‌లు, విద్యుత్ కోతలకు శాశ్వత పరిష్కారం చూపుతాం.

Arvind Kejriwal: తాము (ఆమ్ ఆద్మీ పార్టీ) గుజరాత్‌లో అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఉచిత విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చారు ఢిల్లీ సీఎం, ఆ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్. గుజరాత్‌లో ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. దీని కోసం ఆప్ ఇప్పటినుంచే ప్రచారం మొదలుపెట్టింది. దీనిలో భాగంగా అరవింద్ కేజ్రీవాల్ రెండు రోజులపాటు గుజరాత్‌లో పర్యటిస్తున్నారు.

Agnipath: ‘అగ్నిపథ్’పై వచ్చే వారం సుప్రీంకోర్టులో విచారణ

అహ్మదాబాద్‌లో ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుజరాత్ ఓటర్లకు పలు హామీలు ఇచ్చారు. ‘‘ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఉచిత విద్యుత్ అందిస్తాం. రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ టారిఫ్‌లు, విద్యుత్ కోతలకు శాశ్వత పరిష్కారం చూపుతాం. వచ్చే ఆదివారం దీనికి ఒక పరిష్కారం కనుక్కుని మళ్లీ తిరిగొస్తా. ఇప్పటికే ఢిల్లీ, పంజాబ్‌లో ఉచిత విద్యుత్ పథకం అమలు చేస్తున్నాం. ఢిల్లీలో 73 శాతం, పంజాబ్‌లో 80 శాతం వినియోగదారులు విద్యుత్ బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఢిల్లీలో 24 గంటలు విద్యుత్ అందిస్తున్నాం. రెండున్నరేళ్లలో పంజాబ్‌లో కూడా ఇది సాధిస్తాం. దేశంలో మా పార్టీ తప్ప ఇంకే పార్టీ ప్రజలకు ఉచిత విద్యుత్ అందివ్వడం లేదు. ఇదో మ్యాజిక్. ఒక ఆర్ట్. అది నాకు మాత్రమే తెలుసు.

Narendra Modi: నేటి నుంచి డిజిటల్ ఇండియా వీక్.. ప్రారంభించనున్న మోదీ

ఉచిత విద్యుత్ ఇవ్వడం ఎలా సాధ్యమవుతుంది అనే దాంట్లో ఏ రహస్యం లేదు. మేం ప్రజల కోసమే పనిచేస్తున్నాం. మా పాలనలో ఢిల్లీలో విద్యుత్ రేట్లు పెరగలేవు. మేం ఒక్క రూపాయి కూడా మిమ్మల్ని అడగం’’ అని వ్యాఖ్యానించారు. మరోవైపు రాష్ట్రంలో రైతులకు రాత్రిపూట విద్యుత్ సరఫరా చేయడంపై విమర్శించారు. గుజరాత్‌లో మంత్రులు కూడా రాత్రిపూటే పనిచేయాలని సూచించారు.

ట్రెండింగ్ వార్తలు