Vivo V30e Price : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో నుంచి సరికొత్త వివో స్లిమ్డ్ ఫోన్ వివో V30e ఫోన్ వచ్చేసింది. భారత మార్కెట్లో కొనుగోలుకు ఈ వివో ఫోన్ అందుబాటులో ఉంది. ఇటీవల వివో వి30ఇ ఫోన్ 5,500ఎంఎహెచ్ బ్యాటరీని అందిస్తుంది. ఈ ఫోన్ పోర్ట్రెయిట్ ఎక్స్పీరియన్స్, అల్ట్రా-స్లిమ్ 3డీ కర్వ్డ్ డిస్ప్లేను కలిగి ఉంది. సెగ్మెంట్-లీడింగ్ 50ఎంపీ సోనీ ఐఎమ్ఎక్స్882 ఓఐఎస్ ప్రధాన కెమెరా, వివో ప్రత్యేకమైన స్టూడియో క్వాలిటీ ఆరా లైట్‌తో వస్తుంది.
వివో V30e ఫోన్ 8జీబీ+ 128జీబీ వేరియంట్ ప్రారంభ ధర రూ. 27,999, 8జీబీ+ 256జీబీ వేరియంట్ ధర రూ. 29,999కు పొందవచ్చు. కస్టమర్లు వివో V30e ఫోన్ ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా ఇ-స్టోర్, అన్ని పార్టనర్ రిటైల్ స్టోర్ల నుంచి కొనుగోలు చేయవచ్చు. సరికొత్త వివో V30e ఫోన్ కోసం వినియోగదారులు ఈ ఆఫర్లను పొందవచ్చు.
Read Also : iPhone 16 Series Leak : ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్ వచ్చేస్తోంది.. ధర, డిజైన్, డిస్ప్లే, బ్యాటరీ వివరాలు లీక్..!
మీరు వివో ఫోన్ స్టోర్‌లో కొనుగోలు చేస్తే.. ఐసీఐసీఐ, ఎస్బీఐ, ఇండస్ఇండ్, ఐడీఎఫ్సీ బ్యాంకులపై ఫ్లాట్ 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. మీరు ఎంచుకున్న ఎన్బీఎఫ్సీ పార్టనర్లతో 12 నెలల జీరో డౌన్ పేమెంట్ ఆప్షన్‌ను కూడా పొందవచ్చు. మీరు ఫోన్ ఆన్లైన్లో కొనుగోలు చేస్తే.. హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ బ్యాంకులతో ఫ్లాట్ 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు.
వివో V30e ఫోన్ డిజైన్ కలిగి ఉంది. మెరుగైన ఇన్-హ్యాండ్ అల్ట్రా-స్లిమ్ 3డీ-కర్వ్డ్ డిస్ప్లేతో వెల్వెట్ రెడ్, సిల్క్ బ్లూ అనే 2 కలర్ ఆప్షన్లు కలిగి ఉంది. 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ. 27,999, 8జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ. 29,999కు పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా ఇ-స్టోర్, పార్టనర్ రిటైల్ స్టోర్లలో మే 9, 2024న అందుబాటులోకి వచ్చింది.
వివో V30e కెమెరా సెటప్ ఉంది. 50ఎంపీ ఓఐఎస్ సోనీ ఐఎమ్ఎక్స్882 సెన్సార్ అసాధారణమైన పోర్ట్రెయిట్ సామర్థ్యాలను అందిస్తుంది. ఈ డివైజ్ తక్కువ-కాంతి ఫోటోగ్రఫీలో కూడా పనిచేస్తుంది. అప్‌గ్రేడ్ స్టూడియో క్వాలిటీ స్మార్ట్ ఆరాలైట్ కలిగి ఉంది. ఛాలెంజింగ్ లైటింగ్ పరిస్థితుల్లో పోర్ట్రెయిట్లను అందిస్తుంది.
అంతేకాకుండా, వివో V30e సూపర్-స్మూత్ పర్ఫార్మెన్స్, బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. 5500ఎంఎహెచ్ బ్యాటరీ, 44డబ్ల్యూ ఫ్లాష్ ఛార్జ్‌తో పాటు రోజంతా బ్యాకప్‌ని అందిస్తుంది. క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 6 జనరేషన్ 1 ప్రాసెసర్‌తో ఆధారితంగా పనిచేస్తుంది. వివో V30e 5జీ నెట్వర్క్ అగ్రిగేషన్‌తో సహా మల్టీ టాస్కింగ్ మెరుగైన నెట్వర్క్ ఎక్స్పీరియన్స్ పొందవచ్చు.
ఫన్ టచ్ ఓఎస్ 14 డిస్ప్లేతో ప్రైవసీ ఫీచర్లు, మెరుగైన సెక్యూరిటీ ప్రొటెక్షన్ అందించవచ్చు. వివో గ్రేటర్ నోయిడాలో అన్ని వి30ఇ డివైజ్‌లను భారత్ మేక్ ఇన్ ఇండియా విజన్‌కు అనుగుణంగా 3 జనరేషన్ ఆండ్రాయిడ్ అప్డేట్లు, 4ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ కూడా అందిస్తుంది.
Read Also : Apple iPhone 14 Sale : అమెజాన్‌లో ఆపిల్ ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్.. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు!