Preminchoddu : ‘ప్రేమించొద్దు’ అంటూ పాన్ ఇండియా సినిమా.. రిలీజ్ ఎప్పుడంటే..?

తాజాగా ప్రేమించొద్దు మూవీ సెన్సార్ పూర్తవడంతో ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు

Preminchoddu : శిరిన్ శ్రీరామ్ కేఫ్ బ్యానర్‌పై శిరిన్ శ్రీరామ్ దర్శక నిర్మాణంలో.. అనురూప్ రెడ్డి, దేవా మలిశెట్టి, సారిక, మానస ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా ‘ప్రేమించొద్దు’. బ‌స్తీల్లో సాగే నేపథ్యంతో యూత్‌ఫుల్ లవ్ స్టోరీతో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ ప్రేమించొద్దు సినిమాని పాన్ ఇండియా సినిమాగా 5 భాషల్లో నిర్మించారు.

ఇప్పటికే టీజర్, సాంగ్స్ రిలీజ్ చేశారు. తాజాగా ప్రేమించొద్దు మూవీ సెన్సార్ పూర్తవడంతో ఈ సినిమా తెలుగు వెర్షన్ ని జూన్ 7న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు.

Also Read : Shobha Shetty Engagement : బిగ్‌బాస్ శోభాశెట్టి ఎంగేజ్మెంట్ ఫొటోస్ చూశారా?

ఈ సందర్భంగా దర్శక నిర్మాత శిరిన్ శ్రీరామ్ మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో యువతలో చాలా మంది నిజమైన ప్రేమకు, ఆకర్షణకు తేడా తెలియకుండా తప్పటడుగులు వేస్తున్నారు. వాళ్ళ జీవితాలపై ఇది ప్రభావం చూపిస్తుంది. అలాంటి కథాంశంతో ఈ ప్రేమించొద్దు సినిమాని తెరకెక్కించాం. కొన్ని యదార్థ సంఘటనలను ఆధారంగా తీసుకొని కథ రాసుకున్నాము. ఈ సినిమాని ముందుగా తెలుగులో జూన్ 7న విడుదల చేసి అనంతరం త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో రిలీజ్ చేస్తాము అని తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు