Raayan first single : ధనుష్ ‘రాయన్’ నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది..’తలవంచి ఎరగడే..’
స్వీయ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న చిత్రం 'రాయన్'.
- Thota Vamshi Kumar
- Published On : May 9, 2024 / 06:08 PM IST
Dhanush Raayan first single Out now
Raayan : స్వీయ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న చిత్రం రాయన్. అపర్ణ బాలమురళి, దుషారా విజయన్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రకాశ్ రాజ్, విష్ణువిశాల్, కాళిదాస్ జయరామన్, సందీప్ కిషన్, సెల్వ రాఘవన్, ఎస్‌జే సూర్య కీలక పాత్రలను పోషిస్తున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఏ ఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తోండగా యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో నార్త్ మద్రాస్ బ్యాక్ డ్రాప్‌లో సాగే గ్యాంగ్ స్టర్ డ్రామాగా ఈ సినిమా రూపుదిద్దుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
ధనుష్ కెరీర్‌లో 50వ మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమా పై క్యూరియాసిటీని పెంచింది. జూన్ 13న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాలను మొదలుపెట్టింది. అందులో భాగంగా ఈ చిత్రం నుంచి మొదటి పాటను విడుదల చేశారు.
Preminchoddu : ‘ప్రేమించొద్దు’ అంటూ పాన్ ఇండియా సినిమా.. రిలీజ్ ఎప్పుడంటే..?
ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేసిన ఈ పాట తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో విడుదలైంది. తమిళ్‌లో అడంగాథ అసురన్, తెలుగులో తలవంచి ఎరగడే, హిందీలో కోయీ తోడ్ నా ఇస్కా తో ప్రారంభమైంది. తమిళ వెర్షన్ సాంగ్‌ను ధనుష్ స్వయంగా రాయడం విశేషం. ప్రభుదేవా డ్యాన్స్ కంపోజ్ చేశాడు. కాగా.. ఈ పాట ఎంతో బాగుంది. ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
