Maruti Suzuki Swift : భారత్‌కు మారుతి సుజుకి స్విఫ్ట్ కారు వచ్చేసింది.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ఏ వేరియంట్ ధర ఎంతంటే?

Maruti Suzuki Swift : భారత మార్కెట్లో మారుతీ సుజుకి స్విఫ్ట్ ధర రూ. 6.49 లక్షలతో మొదలై రూ. 9.64 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు అందుబాటులో ఉంది.

Maruti Suzuki Swift : ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి ఇండియా దేశంలో 2024 మారుతి సుజుకి స్విఫ్ట్‌ను రూ. 6.49 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో విడుదల చేసింది. ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ టాప్-ఆఫ్-లైన్ వేరియంట్ రూ. 9.64 లక్షలు (ఎక్స్-షోరూమ్) వద్ద వస్తుంది. వాహనాన్ని సబ్‌స్క్రిప్షన్ ప్రాతిపదికన కూడా పొందవచ్చు. ధరలు నెలకు రూ. 17,436 నుంచి ప్రారంభమవుతాయి.

2024 మారుతి సుజుకి స్విఫ్ట్ అన్నికొత్త జెడ్-సిరీస్ 1.2-లీటర్ 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంది. గరిష్టంగా 82పీఎస్ శక్తిని 113ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో 5-స్పీడ్ ఎంటీ 5-స్పీడ్ ఎఎంటీతో మునుపటిలా ఉన్నాయి.

Read Also : 2024 Maruti Suzuki Swift : 6 ఎయిర్‌బ్యాగ్స్‌తో మారుతి స్విఫ్ట్ కారు వచ్చేస్తోంది.. ఈ నెల 9నే లాంచ్.. బుకింగ్స్ ఓపెన్..!

నాల్గవ తరం మోడల్ ఇంధన సామర్థ్యం ఇప్పుడు పెరిగింది. 2024 మారుతి సుజుకి స్విఫ్ట్ మైలేజ్ 5-స్పీడ్ ఎంటీ వెర్షన్‌కు 24.8కెఎంపీఎల్, 5-స్పీడ్ ఎఎంటీ వెర్షన్‌కి 25.75కెఎంపీఎల్‌గా ఉంటుంది. ఈ కొత్త మారుతి సుజుకి స్విఫ్ట్ 5 వేరియంట్లలో అందిస్తోంది. ఎల్ఎక్స్ఐ, విఎక్స్ఐ, విఎక్స్ఐ(ఓ), జెడ్ఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ ప్లస్ ఉన్నాయి. వేరియంట్ వారీగా మారుతి సుజుకి స్విఫ్ట్ ధరలు (ఎక్స్-షోరూమ్) ఈ కింది విధంగా ఉన్నాయి.

  • 2024 స్విఫ్ట్ ఎల్‌ఎక్స్ఐ ఎంటీ – రూ. 6.49 లక్షలు
  • 2024 స్విఫ్ట్ విఎక్స్ఐ ఎంటీ – రూ. 7.29 లక్షలు
  • 2024 స్విఫ్ట్ విఎక్స్ఐ ఎఎంటీ – రూ. 7.79 లక్షలు
  • 2024 స్విఫ్ట్ విఎక్స్ఐ (ఓ) ఎంటీ – రూ. 7.56 లక్షలు
  • 2024 స్విఫ్ట్ విఎక్స్ఐ (ఓ) ఎఎంటీ – రూ. 8.06 లక్షలు
  • 2024 స్విఫ్ట్ జెడ్‌ఎక్స్ఐ ఎంటీ – రూ. 8.29 లక్షలు
  • 2024 స్విఫ్ట్ జెడ్ఎక్స్ఐ ఎఎంటీ – రూ. 8.79 లక్షలు
  • 2024 స్విఫ్ట్ జెడ్‌ఎక్స్ఐ+ ఎంటీ – రూ. 8.99 లక్షలు
  • 2024 స్విఫ్ట్ జెడ్ఎక్స్ఐ ప్లస్ ఎఎంటీ – రూ. 9.49 లక్షలు
  • 2024 స్విఫ్ట్ జెడ్ఎక్స్ఐ+ ఎంటీ డ్యూయల్ టోన్ – రూ. 9.14 లక్షలు
  • 2024 స్విఫ్ట్ జెడ్ఎక్స్ఐ+ ఎఎంటీ డ్యూయల్ టోన్ – రూ. 9.64 లక్షలు

మారుతి ఇప్పటివరకు దాదాపు 3 మిలియన్ యూనిట్ల స్విఫ్ట్‌లను విక్రయించింది. అన్ని గత జనరేషన్ మోడళ్లకు వాల్యూమ్‌లను కలిగి ఉంటుంది. మొదటి జనరేషన్ స్విఫ్ట్ 2005లో రిలీజ్ కాగా, రెండవ జనరేషన్ 2011లో మార్కెట్‌లోకి ప్రవేశించింది. మూడో జనరేషన్ 2018లో ప్రవేశపెట్టింది.

మొత్తం రూ.1,450 కోట్లతో అభివృద్ధి చేసిన నాల్గవ జనరేషన్ మారుతి సుజుకి స్విఫ్ట్ దేశీయ ఎగుమతి మార్కెట్లలో సుజుకి మోటార్ గుజరాత్ ప్లాంట్‌లో తయారైంది. 2024 మారుతి సుజుకి స్విఫ్ట్, బూమరాంగ్ ఎల్ఈడీ డీఆర్ఎల్‌తో ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లతో కొత్త ఫ్రంట్ గ్రిల్‌ను కలిగి ఉంది. సరికొత్త డిజైన్‌ను కలిగి ఉంది.

బ్యాక్ సైడ్ కొత్త ఎల్ఈడీ టెయిల్‌ల్యాంప్‌లు ఉన్నాయి. కారు ముందు, వెనుక భాగంలో కొత్త బంపర్‌లను కలిగి ఉంది. 15-అంగుళాల ప్రెసిషన్-కట్ డ్యూయల్-టోన్ అల్లాయ్‌లపై డ్రైవ్ చేస్తుంది. లస్టర్ బ్లూ, నావెల్ ఆరెంజ్ అనే 2 కొత్త కలర్ ఆప్షన్లు ఉన్నాయి.

కొత్త మారుతి సుజుకి స్విఫ్ట్ క్యాబిన్ లోపల స్మార్ట్‌ప్లే ప్రో ప్లస్ 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 4.2-అంగుళాల ఎంఐడీతో కూడిన ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జర్, ఆర్కామైస్ సౌండ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉంటాయి. సుజుకి కనెక్ట్‌తో 40 కన్నా ఎక్కువ కనెక్ట్ చేసిన కార్ ఫీచర్‌లను అందిస్తుంది. మారుతి 2024 స్విఫ్ట్ తయారీకి 45శాతం హై-టెన్సైల్ స్టీల్, 20శాతం అల్ట్రా-హై టెన్సైల్ స్టీల్‌ను ఉపయోగించింది.

ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు (స్టాండర్డ్), త్రీ-పాయింట్ సీట్‌బెల్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ఈఎస్‌సీ), ఈఎంబీడీ, హిల్‌తో కూడిన ఏబీఎస్ వంటి సెక్యూరిటీ ఫీచర్లు ఉన్నాయి. 2024 స్విఫ్ట్ కొత్త సస్పెన్షన్ సిస్టమ్, కొత్త హైడ్రాలిక్ క్లచ్ రిలీజ్ అందిస్తోంది. కొత్త స్విఫ్ట్‌లో జెడ్-సిరీస్ ఇంజన్‌తో వస్తుంది. కొత్త మారుతి సుజుకి స్విఫ్ట్ హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్‌ను మాత్రమే కాకుండా టాటా పంచ్, హ్యుందాయ్ ఎక్స్‌టర్ వంటి మైక్రో ఎస్‌యూవీల మార్కెట్ వాటాను కూడా తొలగించాలని భావిస్తోంది.

Read Also : Vivo V30e Price : భారత్‌కు వివో V30e ఫోన్ వచ్చేసింది.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?

ట్రెండింగ్ వార్తలు