Apple iPhone 16 Pro : కిర్రాక్ ఆఫర్ భయ్యా.. ఈ ఆపిల్ ఐఫోన్ 16 ప్రోపై మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్, క్రోమాలో జస్ట్ ఎంతంటే?
Apple iPhone 16 Pro : ఆపిల్ లవర్స్ కోసం అదిరిపోయే డిస్కౌంట్. క్రోమా ప్లాట్ఫారంలో ఐఫోన్ 16 ప్రో అతి తక్కువ ధరకే లభిస్తోంది. ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలంటే?
Apple iPhone 16 Pro
- భారత్‌లో ఆపిల్ ఐఫోన్ 16 ప్రో రూ. 1,19,900 ప్రారంభ ధరకు లాంచ్
- క్రోమా వెబ్సైట్లో రూ.1,03,990కి లిస్టింగ్, రూ.15,910 ఫ్లాట్ డిస్కౌంట్
- ఐఫోన్ 16 ప్రో ట్రిపుల్-రియర్ కెమెరా, A18 ప్రో చిప్, 6.3-అంగుళాల డిస్ప్లే
Apple iPhone 16 Pro : కొత్త ఆపిల్ ఐఫోన్ కొంటున్నారా? అయితే, మీకోసం అద్భుతమైన ఆఫర్. తక్కువ ధరలో ప్రీమియం ఫోన్ కొనేందుకు ఇదే బెస్ట్ టైమ్. మీ పాత స్మార్ట్‌ఫోన్ అప్‌గ్రేడ్ చేసుకోవాలని చూస్తుంటే ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు. ప్రస్తుతం క్రోమాలో ఐఫోన్ 16 ప్రో రూ. 15వేల కన్నా ఎక్కువ తగ్గింపుతో అందిస్తోంది.
ఆపిల్ హై-ఎండ్ ఫోన్ పూర్తి ధర చెల్లించుకుండానే కొనేసుకోవచ్చు. సాధారణంగా ఇలాంటి ఆఫర్లు ఎక్కువ రోజులు ఉండవు. ఐఫోన్ 16 ప్రో A18 ప్రో చిప్, 6.3-అంగుళాల డిస్ప్లే, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ మరిన్నింటితో వస్తుంది. ఈ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
ఆపిల్ ఐఫోన్ 16 ప్రో డీల్ :
భారత మార్కెట్లో ఆపిల్ ఐఫోన్ 16 ప్రో రూ.1,19,900 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. క్రోమా అధికారిక వెబ్సైట్లో ఈ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం రూ.1,03,990కి లిస్ట్ అయింది. రూ.15,910 ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది.
ఐఫోన్ 16 ప్రో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఆపిల్ ఐఫోన్ 16 ప్రో A18 ప్రో చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. 8GB ర్యామ్, 1TB వరకు స్టోరేజీతో వస్తుంది. ఐఫోన్ 16 ప్రో 25W వైర్డు, 15W వైర్లెస్, 4.5W రివర్స్ వైర్డు సపోర్టుతో 3582mAh బ్యాటరీని అందిస్తుంది. ఫ్రంట్ సైడ్ 120Hz వరకు రిఫ్రెష్ రేట్, 2000 నిట్స్ టాప్ బ్రైట్నెస్ 6.3-అంగుళాల ఎల్టీపీఓ అమోల్డ్ డిస్ప్లే ఉంది. ఇంకా, డిస్ప్లే HDR10, డాల్బీ విజన్ సపోర్టుతో వస్తుంది.
ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. ఐఫోన్ 16 ప్రో బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 48MP ప్రైమరీ కెమెరా, 12MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, 48MP అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12MP కెమెరా కూడా ఉంది.
