PM Kisan : పీఎం కిసాన్ 22వ వాయిదాపై షాకింగ్ అప్డేట్.. వేలాది రైతులకు రూ.2వేలు పడవు! మీ పేరు లిస్ట్‌లో ఉందో చెక్ చేయండి
PM Kisan 22nd Installment 2026 : పీఎం కిసాన్ 22 వ వాయిదా విడుదల ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే వేలాది మంది రైతుల పేర్లను జాబితా నుంచి తొలగించింది కేంద్రం. మీ పేరు కూడా జాబితాలో ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి.
PM Kisan 22nd Installment 2026 ( Image credit : Gemini AI )
- పీఎం కిసాన్ 22వ వాయిదాపై కీలక అప్డేట్
- ఇ-కేవైసీ పెండింగ్, ఆధార్ బ్యాంకు ఖాతా లింక్ చేయలేదా?
- పీఎం కిసాన్ స్టేటస్ ఎలా చెక్ చేయాలి
- వేలాది అనర్హులైన రైతుల పేర్లు తొలగింపు
- మార్చి చివరి నాటికి రూ. 2వేలు విడుదల అయ్యే ఛాన్స్
PM Kisan 22nd Installment 2026 : పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్.. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద విడుదల కానున్న 22వ విడత కోసం దేశవ్యాప్తంగా లక్షలాది రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హోలీ తర్వాత రూ. 2వేలు విడుదల చేస్తారని భావించినా ప్రభుత్వం ఎలా ప్రకటన చేయలేదు. కానీ, ఇప్పుడు అంచనాల ప్రకారం ప్రభుత్వం మార్చి 2026 చివరి నాటికి పీఎం కిసాన్ 22వ విడత విడుదల చేసే అవకాశం ఉంది.
ఈసారి అసలైన లబ్ధిదారు రైతులకు మాత్రమే 22వ వాయిదా అందనుంది. లక్షల మంది అనర్హుల జాబితా నుంచి ప్రభుత్వం తొలగించింది. వాయిదా విడుదలకు ముందుగానే అధికారులు లబ్ధిదారుల జాబితాను పూర్తిగా ఫిల్టర్ చేశారు. అనర్హులైన రైతులను గుర్తించి వారిని జాబితా నుంచి తొలగించారు. ఒకవేళ మీ e-KYC పెండింగ్‌లో ఉన్నా లేదా మీ ఆధార్ మీ బ్యాంక్ అకౌంంటుకు లింక్ చేయకపోయినా మీ పేమెంట్ నిలిచిపోవచ్చు.
రూ. 2వేలు ఎప్పుడు వస్తాయంటే? :
ఇప్పుడే (pmkisan.gov.in)లో మీ స్టేటస్ చెక్ చేయండి. అందిన సమాచారం ప్రకారం.. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం 22వ విడత కేంద్ర ప్రభుత్వం మార్చి 2026 చివరి నాటికి విడుదల చేస్తుందని భావిస్తున్నారు. నవంబర్ 2025లో 21వ విడత విడుదల కాగా ఆ తర్వాత 22వ విడత ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు జమ అయ్యే అవకాశం ఉంది.
మరికొన్ని నివేదిలను పరిశీలిస్తే.. వచ్చే వారం చివరి నాటికి రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయవచ్చు. హోలీ తర్వాత వెంటనే రైతులకు పీఎం కిసాన్ ఫండ్స్ విడుదల చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు వర్గాలు సూచిస్తున్నాయి. వచ్చే వారం చివరి నాటికి రైతులకు 22వ విడత అందుతుందని భావిస్తున్నారు.
ప్రతి ఏడాదిలో రూ. 6వేలు జమ :
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాదిలో రైతులకు రూ. 6వేలు అందిస్తుంది. ఈ డబ్బును 3 విడతలుగా పంపిణీ చేస్తారు. ముఖ్యంగా, పీఎం మోదీ స్వయంగా డీబీటీ ద్వారా రైతుల బ్యాంకు ఖాతాలకు నేరుగా డబ్బును పంపుతారు. ప్రతి విడత ప్రతి 4 నెలలకు విడుదల అవుతుందని గమనించాలి. అయితే, కొన్నిసార్లు వాయిదాలు ఆలస్యం అవుతాయి. తద్వారా రైతులు కొంత ఇబ్బంది పడక తప్పదు.
పీఎం కిసాన్ స్టేటస్ ఎలా చెక్ చేయాలి? :
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 22వ విడత రాకముందే మీ స్టేటస్ చెక్ చేయాలనుకుంటే ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది.
- ముందుగా పీఎం కిసాన్ పోర్టల్ (https://pmkisan.gov.in/)కి వెళ్లాలి.
- ఆ తర్వాత మీరు ‘Know Your status’పై క్లిక్ చేయాలి.
- మీ రిజిస్ట్రేషన్ నంబర్‌ను ఎంటర్ చేయాలి.
- ఇప్పుడు మీకు OTP వస్తుంది. ఆపై వెరిఫై చేయండి.
- OTP వెరిఫై తర్వాత మీ స్టేటస్ చెక్ చేయవచ్చు.
ఈ స్కీమ్ ఎప్పుడు ప్రారంభమైంది? :
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన దేశవ్యాప్తంగా అమల్లో ఉంది. ఈ పథకం ఫిబ్రవరి 24, 2019న రైతుల కోసం ప్రారంభమైంది. అప్పటి నుంచి పీఎం కిసాన్ యోజన కింద రైతులు ఏటా రూ. 6వేలు అందుకుంటున్నారు.
మార్చి 13న 22వ వాయిదా విడుదల :
మార్చి 13న ప్రధాని నరేంద్ర మోదీ అస్సాంలోని కోక్రాఝర్‌లో పర్యటించనున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేస్తారు. అదే రోజున ప్రధాని మోదీ పీఎం కిసాన్ యోజన 22వ విడతను ప్రకటించే అవకాశం ఉంది.
21వ విడత ఎప్పుడు వచ్చింది? :
పీఎం కిసాన్ యోజన 21వ విడత గత ఏడాది నవంబర్ 19న విడుదలైంది. ఈ విడతలో రైతులకు రూ. 2వేలు అందాయి. అప్పటి నుంచి రైతులు తమ 22వ విడత కోసం ఎదురు చూస్తున్నారు.
- జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేయండి :
- అధికారిక వెబ్సైట్ (pmkisan.gov.in)ని విజిట్ చేయండి.
- రైట్ సైడ్ ఉన్న ‘Dashboard’పై క్లిక్ చేయండి
- ‘Village Dashboard’ ఎంచుకోండి
- రాష్ట్రం, జిల్లా, సబ్ జిల్లా, పంచాయతీని ఎంటర్ చేయండి
- ‘View’ ట్యాబ్ చేసి, ఆపై ‘Get Report’పై క్లిక్ చేయండి.
- మీరు జాబితాలో ఉంటే మీ పేరు కనిపిస్తుంది.
