Virat Kohli: మౌనమే మార్గం..! డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఓటమి తరువాత కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ వైరల్..

డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ ఓటమి తరువాత టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ  (Virat Kohli) తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఆసక్తికర వ్యాఖ్యలు పంచుకున్నారు.

Virat Kohli

Virat Kohli – WTC Final : ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ (World Test Championship Final) లో భారత్ ఓడిపోయింది. ఇంగ్లాండ్‌లోని ఓవల్‌ మైదానం (Oval ground) లో జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా (Team india)  బ్యాటర్లు, బౌలర్లు విఫలమయ్యారు. ఫలితంగా ఆస్ట్రేలియా  (Australia) ఐదోరోజు ఆట ప్రారంభమైన కొద్ది గంటలకే విజయకేతనం ఎగురవేసింది. 444 పరుగుల లక్ష్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా నాలుగో రోజు మూడు వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. ఐదోరోజు 24 ఓవర్లలో 70 పరుగులకే మిగిలిన ఏడు వికెట్లు కోల్పోయింది. దీంతో భారత్ జట్టు కేవలం 234 పరుగులకే ఆలౌట్ అయింది.

WTC Final 2023: వివాదాస్పద క్యాచ్‌పై స్పందించిన కామెరూన్ గ్రీన్.. కీలక వ్యాఖ్యలు చేసిన రికీ పాంటింగ్

డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ ఓటమి తరువాత టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ  (Virat Kohli) తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఆసక్తికర వ్యాఖ్యలు పంచుకున్నారు. ‘మౌనమే గొప్ప బలానికి మూలం’ అని రాశారు. అందులో ఎటువంటి చిత్రాన్ని పొందుపర్చలేదు. అయితే, ఆ వ్యాఖ్యలను విరాట్ అభిమానులను గందరగోళానికి గురిచేస్తున్నాయి. విరాట్ ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారన్న చర్చ జరుగుతుంది. డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ ఓటమితో టీంలోని అగ్రశ్రేణి బ్యాటర్లు అయిన విరాట్, రోహిత్ శర్మ వంటి వారిపై విమర్శలు వర్షం కురవడం కామనే. ఈ క్రమంలో ముందుగానే విమర్శకులకు సమాధానంగా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఇలా రాసినట్లు కోహ్లీ అభిమానులు అభిప్రాయ పడుతున్నారు. ప్రస్తుతం, విరాట్ కోహ్లీ ఇన్‌స్టా స్టోరీ వైరల్‌గా మారింది.

Virat kohli instagram

ఇదిలాఉంటే ..  ఐదో రోజు మ్యాచ్‌కు ముందుకూడా విరాట్ తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో ఆసక్తికర వ్యాఖ్యలు పోస్టు చేశారు. ‘‘మనలో ఆందోళనలు, భయాలు, సందేహాలు ఉంటే.. ప్రశాంతంగా జీవించడానికి, ప్రేమించడానికి చోటు ఉండదు. అందుకే అలాంటి వాటిని వదిలేసి ఉండటంపై సాధన చేయాలి’’ అని  కోహ్లీ తన ఇన్‌స్టా స్టోరీలో రాశారు. మ్యాచ్ ఓటమి తరువాత ‘మౌనమే గొప్ప బలానికి మూలం’ అని రాశారు

ట్రెండింగ్ వార్తలు