Bowler Seriously injured after being hit on the head in Major League Cricket
క్రికెట్ అంటే సరదాగా ఆడుకునే ఆటే కాదు. అప్రమత్తంగా లేకుంటే ప్రాణాలు కూడా పోతుంటాయి. ఇందుకు ఆస్ట్రేలియా ఆటగాడు ఫిల్ హ్యూస్ ఘటననే నిదర్శనం. తాజాగా ఓ యువ ఆటగాడు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. బ్యాటర్ కొట్టిన ఓ బౌంతి నేరుగా బౌలర్ తలను తాకింది. దెబ్బకు బౌలర్ ముఖం రక్తసిక్తమైంది. ఈ ఘటన మేజర్ లీగ్ క్రికెట్‌లో చోటు చేసుకుంది.
శాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్, సీటెల్ ఓర్కాస్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇది జరిగింది. కార్మీ లే రౌక్స్ బౌలింగ్‌లో సియాటెట్ బ్యాటర్ ర్యాన్ రికిల్‌టన్ స్టైయిట్ గా భారీ షాట్ ఆడాడు. ఆ బంతి నేరుగా బౌలర్ కార్మీ లే రౌక్స్ తలను బలంగా తాకింది. అతడు చేతులను అడ్డుపెట్టుకోవాలని ప్రయత్నించినప్పటికీ.. బాల్ వేగంగా రావడంతో అతడి తలను తాకింది. నొప్పితో బౌలర్ అలాగే మైదానంలో విలవిలలాడాడు. అతడి తల నుంచి రక్తం కారుతోంది.
Ishan Kishan : ఇషాన్ కిషన్ దారెటు..? టీమ్ఇండియాలో రీ ఎంట్రీ కష్టమేనా..? ఒక్కటే మార్గం..!
ఫీల్డ్ అంపైర్లు వైద్య సహాయం కోసం పిలిచారు. అదృష్టవశాత్తు బంతి బలంగా తాకినప్పటికి రౌక్స్ స్పృహలోనే ఉన్నాడు. అతడు ఎవరి సాయం లేకుండానే వైద్య సిబ్బందితో కలిసి మైదానాన్ని వీడాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే.. అతడికి ఎలా ఉందన్న వివరాలు తెలియరాలేదు.
కాగా.. ఓవర్ మధ్యలోనే రౌక్స్ తప్పుకోవడంతో మిగిలిన ఓవర్‌ను అండర్సన్ పూర్తి చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అతడు అదృష్టవంతుడు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Suryakumar Yadav : నా కెప్టెన్సీ సీక్రెట్ అదే.. సూర్యకుమార్ యాదవ్ వ్యాఖ్యలు వైరల్..