IND vs PAK : పాక్ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు.. భారత్‌తో మ్యాచ్ ఓడిపోవడానికి కారణం..
లంక వేదికగా జరుగుతున్న మహిళల ఆసియా కప్ 2024లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా అడుగుపెట్టిన భారత జట్టు అదరగొట్టింది.
- Thota Vamshi Kumar
- Published On : July 20, 2024 / 12:29 PM IST
Nida Dar
Womens Asia Cup T20 2024 : శ్రీలంక వేదికగా జరుగుతున్న మహిళల ఆసియా కప్ 2024లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా అడుగుపెట్టిన భారత జట్టు అదరగొట్టింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పై విజయం సాధించి టోర్నీలో ఘనంగా బోణీ కొట్టింది. దంబుల్లా వేదికగా జరిగిన మ్యాచ్‌లో పాక్ పై భారత్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 19.2 ఓవర్లలో 108 పరుగులకే కుప్పకూలింది. పాక్ బ్యాటర్లలో సిద్రా అమీన్ (25) టాప్ స్కోరర్. భారత బౌలర్లలో దీప్తి శర్మ మూడు వికెట్లు తీసింది. రేణుకా సింగ్, పూజా వస్త్రాకర్, శ్రేయాంక పాటిల్ లు తలా రెండు వికెట్లు పడగొట్టారు.
Mohammed Shami : సానియా మీర్జాతో పెళ్లి..? ఎట్టకేలకు మౌనం వీడిన షమీ..
అనంతరం.. ఓపెనర్లు స్మృతి మంధాన (45; 31 బంతుల్లో 9 ఫోర్లు), షెఫాలీ వర్మ (40; 29 బంతుల్లో 6 ఫోర్లు, 1సిక్స్) దంచికొట్టడంతో భారత్ లక్ష్యాన్ని 14.1వ ఓవర్‌లో మూడు వికెట్లు కోల్పోయి అందుకుంది. కాగా.. మ్యాచ్ అనంతరం తమ ఓటమికి గల కాణాలను పాకిస్తాన్ కెప్టెన్ నిదా దార్ వెల్లడించింది. భారత్‌తో మ్యాచ్‌లో పవర్ ప్లేలో పేలవ ప్రదర్శన చేయడమే తమ జట్టు ఓటమికి ప్రధాన కారణమని చెప్పుకొచ్చింది.
ఈ మ్యాచ్‌లో పాక్ అటు బ్యాటింగ్‌లో ఇటు బౌలింగ్‌లో పవర్ ప్లేలో దారుణంగా విఫలమైంది. బ్యాటింగ్ చేసేటప్పుడు రెండు వికెట్లు కోల్పోయి 37 పరుగులు మాత్రమే చేయగా.. బౌలింగ్‌లో భారత్‌కు 57 పరుగులు సమర్పించుకుంది. ఇరు జట్ల మధ్య ఉన్న వ్యత్సాసం ఇదేనంది. బ్యాటింగ్‌లో విఫలం అయ్యామని, బౌలర్లు మాత్రం తమ వంతు కృషి చేశారంది. ఇక ఓటమిపై విశ్లేషించుకుంటామని తెలిపింది.
Mohammed Shami : అర్ష్‌దీప్ పై ఇంజమామ్ వ్యాఖ్యలు.. ఘాటుగా స్పందించిన షమీ.. వీళ్లంతే..
తదుపరి మ్యాచులో విజయం సాధించేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటామంది. పొట్టి క్రికెట్‌లో పవర్ ప్లే చాలా కీలకమని, పవర్ ప్లేలో పైచేయి సాధిస్తే మ్యాచ్‌లను గెలవచ్చునని చెప్పింది. వికెట్‌ను కాస్త అర్థం చేసుకుని ప్లేయర్లు రాణించాల్సిన అవసరం ఉందంది. కాగా.. పాకిస్తాన్ తమ తరువాతి మ్యాచ్‌లో నేపాల్‌తో ఆడనుంది.
