IND vs SL : కేఎల్ రాహుల్ బ్రొమాన్స్.. కాపాడాడు అని ముద్దు పెట్టబోయాడు.. వీడియో వైరల్..
గాలే వేదికగా భారత్, శ్రీలంక జట్ల మధ్య (IND vs SL) తొలి టెస్టు మ్యాచ్ జరుగుతోంది.
IND vs SL 1st Test KL Rahul Viral Reaction As Devdutt Padikkal DRS Call Saves Him
IND vs SL : గాలే వేదికగా భారత్, శ్రీలంక జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరుగుతోంది. ఆట నాలుగో రోజు కేఎల్ రాహుల్‌ను తొలి ఇన్నింగ్స్ హీరో దేవ్‌దత్ పడిక్కల్ కాపాడాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
భారత్ రెండో ఇన్నింగ్స్ 11వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్‌ను ప్రభాస్ జయసూర్య వేశాడు. ఈ ఓవర్లోని ఐదో బంతిని కేఎల్ రాహుల్ భారీ సిక్సర్‌గా మలిచాడు. అదే ఊపులో ఆరో బంతికి ముందుకు వచ్చి మరో భారీ షాట్ ఆడాలని ప్రయత్నించాడు. అయితే.. బంతి అతడి ప్యాడ్లను తాకింది. లంక ఆటగాళ్లు అప్పీల్ చేయగా అంపైర్ ఔట్ ఇచ్చాడు. తాను ఎల్బీడబ్ల్యూగా ఔట్ అయ్యాయని భావించిన కేఎల్ రాహుల్ పెవిలియన్‌కు వెళ్లేందుకు సిద్ధం అయ్యాడు.
Also Read – Tilak Varma : తిరుమలలో టీమ్ఇండియా క్రికెటర్ తిలక్ వర్మ.. ఫోటోలు వైరల్..
— Sri Lanka Today (@OneCountry1LK) August 18, 2026
అయితే.. నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న పడిక్కల్ రివ్యూ తీసుకోవాలని సూచించాడు. దీంతో రాహుల్ రివ్యూ తీసుకున్నాడు. బంతి వికెట్లను తాకలేదు. పై నుంచి వెళ్లినట్లుగా కనిపించింది. అంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకోగా.. లంక ఆటగాళ్లు నిరాశలో మునిగిపోయారు. రాహుల్ వెంటనే పడిక్కల్ వద్దకు వచ్చి అతడిని కౌగలించుకున్నాడు. రివ్యూ తీసుకోమని చెప్పినందుకు అతడికి ముద్దు పెడుతున్నట్లుగా బ్రొమాన్స్ చేయడం కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
Devdutt Padikkal saved KL Rahul here
He was the one who told him to go for the review when KL was already ready to walk back to the dressing room. And KL acknowledged it with that hug ❤️#INDvsSL pic.twitter.com/Ny3yTtqUz1— SiKANDAR (@430atEdgbaston) August 18, 2026
కాగా.. ఈ సమయంలో రాహుల్ 25 పరుగులతో ఆడుతున్నాడు. అయితే.. ఈ అవకాశాన్ని రాహుల్ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. మరో 10 పరుగులు మాత్రమే జోడించి 35 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్దే ప్రభాత్ జయసూర్య బౌలింగ్‌లోనే ఔట్ అయి పెవిలియన్‌కు చేరుకున్నాడు.
