Gyanvapi: జ్ఞానవాపి మసీదులో శివలింగం.. సీజ్ చేయాలన్న కోర్టు

ఉత్తర ప్రదేశ్‌, వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో జరుగుతున్న సర్వే అంశం కొత్త మలుపు తిరిగింది. తాజా సర్వేలో శివలింగం కనిపించినట్లు సర్వేను పర్యవేక్షిస్తున్న లాయర్ ప్రకటించారు.

Gyanvapi : ఉత్తర ప్రదేశ్‌, వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో జరుగుతున్న సర్వే అంశం కొత్త మలుపు తిరిగింది. తాజా సర్వేలో శివలింగం కనిపించినట్లు సర్వేను పర్యవేక్షిస్తున్న లాయర్ ప్రకటించారు. అయితే, సర్వేను వీడియో తీసిన కెమెరామెన్ మాత్రం తాను అలాంటిదేమీ చూడలేదన్నారు. ఈ నేపథ్యంలో మసీదు ప్రాంతాన్ని సీజ్ చేయాలని వారణాసి కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో జ్ఞానవాపి మసీదులో మూడు రోజులుగా జరుగుతున్న సర్వే సోమవారం ముగిసింది. ఈ సర్వే మొత్తాన్ని కోర్టు ఏర్పాటు చేసిన కమిటీ ఆధ్వర్యంలో వీడియో తీసిన సంగతి తెలిసిందే.

Delhi Mundka Fire : ఢిల్లీ అగ్నిప్రమాదం.. ఇంకా 29మంది మిస్సింగ్.. మెజిస్టీరియ‌ల్ విచార‌ణ‌కు సీఎం ఆదేశం

గట్టి భద్రత మధ్య సర్వే నిర్వహించారు. సర్వేను పర్యవేక్షించిన లాయర్ విష్ణు జైన్.. మసీదులోపల పన్నెండు అడుగుల శివలింగం ఉన్నట్లు చెప్పాడు. శివలింగం ఉన్నట్లు లాయర్ చెప్పడంతో, ఈ ప్రాంతాన్ని సీజ్ చేయాలని స్థానిక సివిల్ కోర్టు ఆదేశించింది. ఈ ప్రాంతం మొత్తాన్ని అదుపులోకి తీసుకోవాలని, లోపలికి ఎవరూ ప్రవేశించకుండా చూడాలని సూచించింది. కాగా, మసీదు లోపల శివలింగం కనిపిచండంపై యూపీ డిప్యూటీ సీఎం కేశవ ప్రసాద్ సంతోషం వ్యక్తం చేశారు.

ట్రెండింగ్ వార్తలు