West Bengal : విమానంలో కుదుపులు.. మమతకు వెన్నునొప్పి ?, విచారణకు టీఎంసీ సర్కార్ ఆదేశం

వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రయాణిస్తున్న విమానం భారీ కుదుపులకు గురైంది. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్...

Mamata Banerjee’s Flight Faces Mid-Air : వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రయాణిస్తున్న విమానం భారీ కుదుపులకు గురైంది. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) నివేదిక కోరింది. ఆమె ప్రయాణించే విమాన మార్గానికి ముందస్తు అనుమతి ఉందా ? అనే విషయమై కూడా డీజీసీఏ నుంచి సమాచారం కోరింది. ఆమె ప్రయాణించిన విమానం దసో ఫాల్కాన్ 2000గా.. 10.3 టన్నుల బరువుండే తేలికపాటి విమానమని తెలుస్తోంది. ఇద్దరు విమాన సిబ్బందితో సహా 19 మంది ప్రయాణించే అవకాశం ఉంది.

Read More : UP : యూపీలో మమతకు షాక్.. నల్లజెండాలతో నిరసన

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మొత్తం ఏడు దశల్లో పోలింగ్ జరుగుతోంది. ఇప్పటికే ఆరు దశల్లో పోలింగ్ పూర్తయ్యింది. మార్చి 7వ తేదీన ఏడో దశ పోలింగ్ జరుగనుంది. ఈ ఎన్నికల్లో బీజేపీ వర్సెస్ ఎస్పీ అన్నట్లుగా ఉంది. అధికారం మరోసారి నిలబెట్టుకోవాలని బీజేపీ, ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని ఎస్పీ ప్రయత్నాలు చేస్తోంది. ఎస్పీకి మద్దతుగా సీఎం మమతా బెనర్జీ వారణాసికి వెళ్లారు. శుక్రవారం సాయంత్రం వారణాసి నుంచి ప్రత్యేక విమానంలో తిరుగు ప్రయాణమయ్యారు. మధ్యలో భారీగా కుదుపులు చోటు చేసుకున్నాయి. పైలట్ చాకచక్యంతో విమానాన్ని సేఫ్ గా కోల్ కతా విమనాశ్రయంలో దింపాడు. అయితే స్వల్పంగా మమతా వెన్నునొప్పికి గురైనట్లు సమాచారం. ఇలాంటి ఘటనలపై తాము దర్యాప్తు చేయడం జరుగుతుందని, వీవీఐపీల విషయంలో అధిక ప్రాధాన్యం ఇస్తామని డీజీసీఏ అధికారి వెల్లడించారు. ఓ నివేదికను సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ట్రెండింగ్ వార్తలు