Manipur Minister Residence Burned: మణిపూర్‌లో మళ్లీ హింసాకాండ..మంత్రి ఇల్లు దహనం

అంతర్గత కలహాలతో కల్లోలంగా మారిన మణిపూర్ లో మళ్లీ హింసాకాండ చెలరేగింది. మణిపూర్ లోని ఇంఫాల్ వెస్ట్ లో మంత్రి నెమ్చా కిప్ జెన్ అధికారిక నివాసాన్ని ఆందోళన కారులు దహనం చేశారు....

Minister Residence Burned

Burned Down Manipur Minister Residence: అంతర్గత కలహాలతో కల్లోలంగా మారిన మణిపూర్ లో మళ్లీ హింసాకాండ చెలరేగింది. మణిపూర్ లోని ఇంఫాల్ వెస్ట్ లో మంత్రి నెమ్చా కిప్ జెన్(Manipur minister Nemcha Kipgen) అధికారిక నివాసాన్ని ఆందోళన కారులు దహనం చేశారు. బుధవారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు పోలీసులు చెప్పారు.కాంగ్‌పోక్పి జిల్లా పరిధిలోని ఖమెన్‌లోక్ ప్రాంతంలోని ఒక గ్రామంలో దుండగులు దాడి చేయడంతో 9 మంది మృతి చెందగా, మరో తొమ్మిది మంది గాయపడ్డారు. గ్రామంలో దుండగులు కాల్పులు జరిపి దహన దాడులకు పాల్పడ్డారు.

Cyclone Biparjoy : నేడు తీరం దాటనున్న బిపర్‌జోయ్ తుపాన్..74వేల మంది తరలింపు

ఖమెన్‌లోక్ గ్రామంలో దుండగులు పలు ఇళ్లను తగలబెట్టారు. తమెంగ్‌లాంగ్ జిల్లా గోబజాంగ్‌లో పెచ్చరిల్లిన హింసాకాండలో పలువురు గాయపడ్డారు.మణిపూర్ లో పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది. శాంతిభద్రతల పరిరక్షణకు భద్రతా సిబ్బంది హైరిస్క్ ప్రాంతాల్లో గస్తీ కొనసాగిస్తున్నారు.గత 24 గంటల్లో తెంగ్నౌపాల్, ఇంఫాల్ తూర్పు జిల్లాల నుంచి తుపాకులు, 63 మందుగుండు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Uniform Civil Code: 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందే బీజేపీ కేంద్ర సర్కార్ సంచలన నిర్ణయం

ఇప్పటివరకు మొత్తం 1,040 ఆయుధాలు, 13,601 మందుగుండు సామాగ్రి, 230 రకాల బాంబులను స్వాధీనం చేసుకున్నామని మణిపూర్ భద్రతా సలహాదారు కుల్దీప్ సింగ్ చెప్పారు. అధికారులు ఇంఫాల్ తూర్పు జిల్లా,ఇంఫాల్ పశ్చిమ జిల్లాలో ఉదయం 5 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కర్ఫ్యూ సడలింపు వేళలను కుదించారు. మణిపూర్‌లోని 16 జిల్లాల్లో 11 జిల్లాల్లో కర్ఫ్యూ అమలులో ఉంది. మొత్తం ఈశాన్య రాష్ట్రంలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు.

ట్రెండింగ్ వార్తలు