Naga Chaitanya: ఆ డైరెక్టర్‌తో చైతూ సినిమా..?

టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య ఇటీవల బంగార్రాజు చిత్రంతో అదిరిపోయే సక్సెస్ అందుకున్నాడు. ఈ హీరో ప్రస్తుతం దర్శకుడు విక్రమ్ కుమార్ డైరెక్షన్‌లో ‘థ్యాంక్ యు’....

Naga Chaitanya: టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య ఇటీవల బంగార్రాజు చిత్రంతో అదిరిపోయే సక్సెస్ అందుకున్నాడు. ఈ హీరో ప్రస్తుతం దర్శకుడు విక్రమ్ కుమార్ డైరెక్షన్‌లో ‘థ్యాంక్ యు’ అనే సినిమాలో నటిస్తున్నాడు. అంతేగాక ఓ బాలీవుడ్ సినిమాలో కూడా చైతూ నటిస్తున్నాడు. ఇలా వరుసగా సినిమాలతో బిజీగా ఉన్న చైతూ, త్వరలో మరో డైరెక్టర్‌తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. అయితే ఈ డైరెక్టర్ చైతూ మాజీ భార్య సమంతకు చాలా క్లోజ్ ఫ్రెండ్ కావడంతో ఇప్పుడు ఈ కాంబోపై అందరి చూపులు ఉన్నాయి. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరో అనుకుంటున్నారా..?

Naga Chaitanya: చైతూ సస్పెన్స్ యాక్షన్.. కోలీవుడ్ స్టార్ దర్శకుడితో సినిమా!

లేడీ డైరెక్టర్‌గా టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న నందిని రెడ్డి ఇటీవల చైతూకి ఓ కథను చెప్పినట్లు తెలుస్తోంది. ఈ కథ తనకు బాగా నచ్చడంతో చైతూ కూడా ఈ సినిమా చేసేందుకు ఓకే చెప్పాడట. అయితే నందిని రెడ్డి గతంలో సమంతతో ‘ఓ బేబీ’ చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే సమంతతో నందిని రెడ్డి బాగా క్లోజ్ అయ్యిందని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు చై-సామ్ విడిపోయాక నందిని రెడ్డి చైతూతో సినిమా చేస్తుండటంతో సమంత ఎలా రియాక్ట్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

Naga Chaitanya: చైతూ రేర్ ఫీట్.. అతికొద్ది మందిలో ఒక్కడు!

అయితే ఇది కేవలం గాసిప్‌గా మాత్రమే ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. మరి నిజంగానే చైతూతో నందిని రెడ్డి సినిమా చేస్తుందా అనేది తెలియాలంటే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. కాగా చైతూ ఇప్పటికే వెంకట్ ప్రభు డైరెక్షన్‌లో ఓ సినిమా చేయాల్సి ఉండగా.. విక్రమ్ కుమార్‌తో ఓ వెబ్ సిరీస్‌లో కూడా నటించనున్నాడు. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయ్యాకే నందిని రెడ్డి సినిమా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్‌పై స్వప్న దత్ ప్రొడ్యూస్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు