Rajini – Shah Rukh : కొత్త పార్లమెంట్‌ పై రజినీ, షారుఖ్‌ ట్వీట్‌.. రిప్లై ఇచ్చిన ప్రధాని మోదీ!

కొత్త పార్లమెంట్ పై రజినీకాంత్, షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్ ట్వీట్స్ చేయగా.. వాటికీ ప్రధాని మోదీ రిప్లై ఇచ్చారు.

Rajinikanth – Shah Rukh Khan : దేశ ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) నేడు (మే 28) కొత్త పార్లమెంట్ ని ప్రారంభించారు. కాగా మే 26న మోదీ ట్విట్టర్ లో నూతన పార్లమెంట్‌ కి సంబంధించిన వీడియోని షేర్ చేశారు. ఆ వీడియోకి కేవలం బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మాత్రమే ఉంది. అయితే కొత్త పార్లమెంట్‌ పై తమ అభిప్రాయాలను ఆ వీడియోకి వాయిస్‌ ఓవర్‌ గా చేసి పంపాలని మోదీ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, హిందీ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్ (Akshay Kumar) తమ వాయిస్ ఓవర్ తో వీడియో షేర్ చేశారు. ఇక వాటికి మోదీ రిప్లై ఇవ్వగా ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Vishwak Sen : విశ్వక్ సేన్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్.. తెలుగోడి ఆత్మగౌరవం ఎన్టీఆర్ అంటున్న విశ్వక్!

షారుఖ్ ఇలా చెప్పుకొచ్చాడు.. “గ్రామాలు, పట్టణాలు, దేశంలోని మారుమూల ప్రాంతాలోని 140 కోట్ల మంది భారతీయులు ఇక్కడ ఒకే కుటుంబంగా నిలుస్తారు. సత్యమేవ జయతే అనేది ఇక్కడ నినాదం కాదు విశ్వాసం” అంటూ వ్యాఖ్యానించాడు. ఇక షారుఖ్ మాటలకి మోదీ రిప్లై ఇస్తూ.. “చాలా అద్భుతంగా చెప్పారు. ప్రగతికి, ప్రజా స్వామ్య బలానికి ప్రతీకే కొత్త పార్లమెంట్‌ భవనం” అని ట్వీట్ చేశారు.

ఇక అక్షయ్ కుమార్ పార్లమెంట్ భవనం గురించి మాట్లాడుతూ.. “దేశ అభివృద్ధికి విశిష్ట చిహ్నంగా కొత్త పార్లమెంట్ ఎప్పటికి నిలవాలని. ఈ భవనాన్ని చూడటం గర్వకారణం” అంటూ చెప్పుకొచ్చాడు. మోదీ రిప్లై.. “మీ ఆలోచనలను బాగా చెప్పారు. భవిషత్తులో కూడా ఈ పార్లమెంట్ భవనం అభివృద్ధికి చిహ్నంగా నిలుస్తుంది” అంటూ ట్వీట్ చేశారు.

అలాగే పాత పార్లమెంట్ నుంచి కొత్త పార్లమెంట్ కి పవర్ చేంజ్ ని తమిళనాడు సింగోల్ ట్రేడిషన్ పద్దతిలో చేస్తున్న దాని గురించి రజినీకాంత్ ప్రస్తావిస్తూ మోదీకి థాంక్యూ చెప్పారు. దానికి మోదీ రిప్లై ఇస్తూ.. “కొత్త పార్లమెంట్ లో తమిళనాడు కల్చర్ ని ఫాలో అవ్వడాన్ని మొత్తం దేశం గర్వంగా భావిస్తుంది” అంటూ చెప్పుకొచ్చారు.

ట్రెండింగ్ వార్తలు