Wrestlers Protest : జంతర్ మంతర్ వద్ద కొనసాగుతున్న రెజ్లర్ల ఆందోళన.. నీరజ్ చోప్రా ట్వీట్

రెజ్లర్ల నిరసనకు మద్దతుగా అర్జున అవార్డు గ్రహీత, ఒలంపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన కీలక సూచనలు చేశారు.

Wrestlers Protest : రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపిస్తూ.. అతనిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ అంతర్జాతీయ క్రీడల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన పలువురు రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు దిగిన విషయం విధితమే. గత నాలుగు రోజులుగా వారి ఆందోళన కొనసాగుతూనే ఉంది. మరోవైపు లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేసినా పోలీసులు ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని పేర్కొంటూ ఏడుగురు రెజ్లర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. క్రీడాకారులు చేసిన పిటీషన్‌ను తీవ్రంగా పరిగణించి సుప్రీంకోర్టు ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై శుక్రవారం మరోసారి విచారిస్తామని తెలిపింది. దీంతో ఇవాళ సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరగనుంది.

Wrestlers Protest: మేరీకోమ్‌కే బాధ్యతలు.. రెజ్లర్ల‌పై వేధింపుల ఆరోపణలను నిగ్గుతేల్చేందుకు కమిటీని నియమించిన కేంద్రం

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు దిగిన రెజ్లర్ల నిరసనకు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు తెలిపింది. పలు పార్టీలు, ప్రముఖులు, సెలబ్రెటీలు, క్రీడాకారులు మద్దతు తెలుపుతున్నారు. మరోవైపు లైగింక ఆరోపణలు ఎదుర్కొంటున్న డబ్ల్యూఎఫ్ఐ ప్రెసిడెంట్ గురువారం ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. తనపై వచ్చిన లైంగిక ఆరోపణల అంశాన్ని ప్రస్తావిస్తూ.. తన నిస్సహాయతను ఎప్పటికీ అంగీకరించలేనని స్పష్టం చేశారు.

Hyderabad ORR Lease: 30ఏళ్లు లీజుకు ఓఆర్ఆర్.. హెచ్ఎండీఏకు భారీగా ఆదాయం..

తాజాగా.. రెజ్లర్ల నిరసనకు మద్దతుగా అర్జున అవార్డు గ్రహీత, ఒలంపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ట్వీట్ చేశారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేయాలన్న రెజ్లర్ల డిమాండ్​కు మద్దతు పలికారు. రెజ్లర్లు న్యాయం కోసం ఆందోళన చేయాల్సి రావడం బాధాకరమన్నారు. అథ్లెట్ అయినా కాకపోయినా ప్రతి ఒక్కరి గౌరవాన్ని కాపాడే బాధ్యత మనపై ఉంటుందని అన్నారు. మన అథ్లెట్లు న్యాయం కోరుతూ వీధుల్లోకి రావడం నాకు బాధ కలిగించిందని పేర్కొన్నారు. మన దేశానికి ప్రాతినిధ్యం వహించడానికి, మనల్ని గర్వపడేలా చేయడానికి రెజ్లర్లు చాలా కష్టపడ్డారని, ప్రతి వ్యక్తి సమగ్రతతో పాటు గౌరవాన్ని కాపాడే బాధ్యత మనపై ఉంది. అది క్రీడాకారుడైనా కాకపోయినా కూడా అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు.

 

 

ప్రస్తుతం జరుగుతున్న విషయం మరెప్పుడూ జరగకూడదు. ఇది సున్నితమైన సమస్య. నిష్పక్షపాతంగా పారదర్శకంగా వ్యవహరించాలి. న్యాయం జరిగేలా సంబంధిత అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలని నీరజ్ చోప్రా రెజ్లర్ల ఆందోళనకు మద్దతు తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు