అయోధ్య రామమందిరం పైకప్పు లీకేజీ..! అసలు విషయం చెప్పిన ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్

అయోధ్య రామ మందిరం గర్భగుడిలోకి పైకప్పు నుంచి నీరు కారుతున్నట్లు వచ్చిన ఆరోపణలను ఆయల నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర ..

Ayodhya Ram Temple

Ram Temple Roof Leaking : అయోధ్య రామమందిరం పైకప్పు లీకేజీ కావడం, గర్భగుడిలోకి వర్షపు నీరు చేరడం తీవ్ర దుమారానికి కారణం అయింది. భవ్య రామ మందిరం ప్రారంభోత్సవం జరిగిన తరువాత కురిసిన తొలి వర్షాలకే ఆలయం పైకప్పు నుంచి నీరు కారుతోందని ఆలయ ప్రధాన అర్చకులు సత్యేంద్ర దాస్ ఆందోళన వ్యక్తం చేశారు. బాల రాముడి గర్భగుడిలోకి నీరు వచ్చి చేరిందని అన్నారు. దీంతో దేశవ్యాప్తంగా ఈ అంశం తీవ్ర చర్చకు దారితీసింది. ఆలయం ప్రారంభించి ఆరు నెలలు కూడా గడవకముందే లీకేజీలు ఏర్పడటం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఈ క్రమంలో ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ ఈ అంశంపై క్లారిటీ ఇచ్చారు.

Also Read : Women commandos : మావోల వేటకోసం రంగంలోకి మహిళా కమాండోలు..

అయోధ్య రామ మందిరం గర్భగుడిలోకి పైకప్పు నుంచి నీరు కారుతున్నట్లు వచ్చిన ఆరోపణలను ఆయల నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్ర తోపిపుచ్చారు. పైకప్పు నుంచి నీరు కారడం లేదు. విద్యుత్ వైర్ల కోసం పెట్టిన పైపుల్ని ఇంకా మూయకపోవడంతో అందులో నుంచి నీరు లోపలికి వచ్చిందని చెప్పారు. మొదటి అంతస్తు పనులు ఇంకా జరుగుతున్నాయి.. దీంతోపాటు ఇప్పటికే ప్రారంభమైన రెండో అంతస్తు పైకప్పు నిర్మాణం పూర్తయితే ఆలయం లోపలికి నీరు రావడం ఆగిపోతుందని నృపేంద్ర మిశ్ర క్లారిటీ ఇచ్చారు.