NMMLS: నెహ్రూ మెమోరియల్ పేరు మార్చిన కేంద్రం.. కొత్త పేరేంటో తెలుసా?

స్వయంప్రతిపత్త సంస్థగా స్థాపించబడిన, నెహ్రూ మెమోరియల్ మ్యూజియం & లైబ్రరీ 'ఆధునిక, సమకాలీన భారతదేశం'పై అధునాతన పరిశోధనలను ప్రోత్సహించడానికి జాతికి అంకితం చేశారు. ఇది దేశ రాజధానిలోని చారిత్రాత్మక తీన్ మూర్తి క్యాంపస్‌లో ఉంది

NMMLS: దేశ రాజధాని ఢిల్లీలోని నెహ్రూ మెమోరియల్ పేరును కేంద్ర ప్రభుత్వం మార్చింది. ప్రస్తుతం దాని పేరు పీఎం మెమోరియల్‌ అండ్ లైబ్రరీ పేరు మార్చారు. కాగా పేరు మార్పుపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడింది. పేరు మార్పు పూర్తిగా పగ, పక్షపాతంతో కూడిదని కాంగ్రెస్ విమర్శించింది. నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీని ప్రస్తుతం ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం అండ్ సొసైటీగా మార్చారు.

International Day: ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్యసమితి కేంద్ర కార్యాయలంలో యోగా చేయనున్న ప్రధాని మోదీ

మీడియా కథనాల ప్రకారం, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన గురువారం ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమావేశంలోనే నెహ్రూ మెమోరియల్ పేరు మార్పుపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఆమోదం లభించింది. నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీకి రాజ్‌నాథ్ సింగ్ వైస్ చైర్మన్. దీనికి ప్రధానమంత్రి చైర్మన్. వీరితో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, నిర్మలా సీతారామన్, ధర్మేంద్ర ప్రధాన్, జీ.కిషన్ రెడ్డి, అనురాగ్ ఠాకూర్ సహా 29 మంది సభ్యులు ఈ సొసైటీలో సభ్యులుగా ఉన్నారు.

AP Politics: వపన్ హీరోయిజం నుంచి జీరోయిజానికి వచ్చారు.. ‘ఒక్క ఛాన్స్’ రిమార్క్‭పై ఆర్జీవీ సెటైర్

స్వయంప్రతిపత్త సంస్థగా స్థాపించబడిన, నెహ్రూ మెమోరియల్ మ్యూజియం & లైబ్రరీ ‘ఆధునిక, సమకాలీన భారతదేశం’పై అధునాతన పరిశోధనలను ప్రోత్సహించడానికి జాతికి అంకితం చేశారు. ఇది దేశ రాజధానిలోని చారిత్రాత్మక తీన్ మూర్తి క్యాంపస్‌లో ఉంది. 1964లో నెహ్రూ చనిపోయిన అనంతరం ఆయన 75వ జయంతిని పురస్కరించుకుని నవంబర్ 14న అప్పటి రాష్ట్రపతి డాక్టర్‌ సర్వపల్లి రాధాకృష్ణన్‌ దీనిని ప్రారంభించారు. తీన్ మూర్తి భవన్, ఆగస్టు 1948 నుండి మే 27, 1964 వరకు నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు ఆయనకు అధికారిక నివాసంగా ఉంది.

ట్రెండింగ్ వార్తలు