Rakesh Tikait : మోడీని కిమ్ తో పోల్చిన తికాయిత్

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తోన్న ఆందోళనల పట్ల కేంద్రప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బీకేయూ) నేత రాకేశ్‌ తికాయిత్‌ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.

Rakesh Tikait నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తోన్న ఆందోళనల పట్ల కేంద్రప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బీకేయూ) నేత రాకేశ్‌ తికాయిత్‌ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని.. ఉత్తర కొరియా నియంత కిమ్‌ జోంగ్‌ ఉన్‌తో పోల్చుతూ మంగళవారం రాత్రి తికాయిత్ ట్వీట్ చేశారు.

ప్రధాని మోడీని ‘రాజా’ అని సంభోదిస్తూ..ద్రవ్యోల్భణం బాగా పెరిగిపోయింది. అదేంటని ఎవరైనా ప్రభుత్వ వ్యతిరేక గళం మాత్రం..రాజావారు కిమ్ జోంగ్ ఉన్ లా వాళ్లను శిక్షిస్తుంటారు. రాజాకు వ్యతిరేకంగా మాట్లాడటమంటే శిక్షకు సిద్ధపడడమే అంటూ తికాయత్ ట్వీట్‌ చేశారు. తనకు వ్యతిరేకంగా ఎవరూ నోరు మెదపకుండా మోడీ చేస్తున్నారని తికాయిత్ ఆరోపించారు.

ఇక,నూతన వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాల్సిందేనని బుధవారం చేసిన ఓ ట్వీట్ లో తికాయిత్ స్పష్టం చేశారు. కనీస మద్దతు ధరపై చట్టం చేయాల్సిందేనని ట్వీట్ లో తికాయిత్ స్పష్టం చేశారు. రైతుల డిమాండ్లను నెరవేర్చే వరకు ఇళ్లకు తిరిగి వెళ్లే ప్రశ్నే లేదని తికాయిత్ ఇప్పటికే తేల్చి చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు