Adipurush : ఆ రికార్డులో ఇండియాలోనే ఏకైక స్టార్ ప్రభాస్.. మూడు సినిమాలతో మొదటిరోజు!

ప్రభాస్ ఆదిపురుష్ సినిమా నిన్న ఆడియన్స్ ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రంతో ప్రభాస్ సరికొత్త రికార్డు సృష్టించాడు.

Prabhas creates new record with Adipurush first day collections

Prabhas Adipurush : ప్రభాస్ రాముడిగా నటిస్తూ ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమా ఆదిపురుష్. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం నిన్న (జూన్ 16) భారీ ఎత్తున రిలీజ్ అయ్యింది. వరల్డ్ వైడ్ గా ఈ మూవీ 6200 థియేటర్స్ లో విడుదల అయ్యింది. ఇండియాలోనే దాదాపు 4000 పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యినట్లు తెలుస్తుంది. రామాయణ కథ కావడంతో ఇండియా వైడ్ అభిమానులు సినిమాని చూసేందుకు ఆసక్తి చూపారు. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద ఈ మూవీ భారీ ఓపెనింగ్స్ అందుకుంది.

Adipurush: ఆదిపురుష్ సినిమా కాంట్రవర్సీలోకి మహా సీఎంను లాగిన నెటిజెన్.. ఫోన్ నంబర్ షేర్ చేయమంటూ ఝలక్ ఇచ్చిన థానే పోలీస్

సినిమా ట్రేడ్ వర్గాలు ప్రకారం ఈ చిత్రం మొదటిరోజు ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద 100 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకుందని తెలుస్తుంది. కాగా ప్రభాస్ గత చిత్రాలు బాహుబలి, సాహూ సినిమాలు ఫస్ట్ డే 100 కోట్లకు పైగా కలెక్షన్స్ ని అందుకుంది. ఇక ఇప్పుడు ఆదిపురుష్ తో కూడా మరోసారి ఆ ఫీట్ సాధించినట్లు సమాచారం. ఇక మూడు సినిమాలతో మొదటిరోజే 100 కోట్ల అందుకున్న ఏకైక హీరోగా ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభాస్ సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడని చెబుతున్నారు.

Adipurush : నేపాల్‌లో ఆదిపురుష్ వివాదం.. డైలాగ్ తీసేయాలంటూ నేపాల్ నేతలు.. అసలు ఏమైంది?

అయితే మూవీ టీం నుంచి ఫస్ట్ కలెక్షన్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ సినిమా మొదటి వీకెండ్ మూడు రోజులు టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్ రూపంలో ఆల్రెడీ అమ్ముడు పోయిన సంగతి తెలిసిందే. దీంతో ఈ చిత్రం ఫస్ట్ వీకెండ్ పూర్తి చేసుకునేప్పటికీ 150 కోట్లకు పైగా కలెక్షన్స్ ని అందుకుంటుందని చెబుతున్నారు. కాగా ఈ చిత్రాన్ని దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో టి సిరీస్, రెట్రోఫైల్స్ సంస్థలు కలిసి నిర్మించాయి. ఇక ఈ మూవీలో సీతగా కృతి సనన్ (Kriti Sanon), రావణాసురుడిగా సైఫ్ అలీఖాన్ (Saif Alikhan) నటించారు.

ట్రెండింగ్ వార్తలు