Vande Bharat Express: ఆదివారం మినహా మిగతా రోజుల్లో అందుబాటులో.. తెలుగు రాష్ట్రాల్లో వందే భారత్ రైలు టైమింగ్స్ ఇవే..

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు తెలుగు రాష్ట్రాల్లో పరుగులు పెట్టనుంది. వారంలో ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఈ రైలు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. సికింద్రాబాద్ - విశాఖపట్నం మధ్య నడిచే ఈ రైలును సంక్రాంతి సందర్భంగా ఈనెల 15న దిల్లీ నుంచి ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు.

Vande Bharat Express: వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు తెలుగు రాష్ట్రాల్లో పరుగులు పెట్టనుంది. వారంలో ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఈ రైలు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. సంక్రాంతి సందర్భంగా ఈనెల 15న సికింద్రాబాద్ – విశాఖపట్నం మధ్య నడిచే ఈ రైలును ఢిల్లీ నుంచి ప్రధాని  నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభిస్తారు. తాజాగా దక్షిణ మధ్య రైల్వే వందేభారత్ రైలు ప్రయాణించే ప్రాంతాలు, ఆగే స్టేషన్లు, టైమింగ్స్ వివరాలను వెల్లడించింది.

Vande Bharat Express : జస్ట్ 8.40 గంటలే.. 3రోజుల్లో సికింద్రాబాద్-వైజాగ్ మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ పరుగులు

రేపు ప్రధాని మోదీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఉదయం 10.30 గంటలకు ఢిల్లీ నుంచి వర్చువల్ గా ఈ రైలును ప్రారంభిస్తారు. పలు ప్రాంతాల్లో స్టేషన్ల గుండా రాత్రి 8.45 గంటలకు విశాఖపట్నం చేరుతుంది. అయితే, వందేభారత్ రైలు పూర్తిస్థాయిలో 16వ తేదీ నుంచి ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. వందేభారత్ రైలులో 14 ఏసీ చైర్ కార్లు సహా రెండు ఎగ్జిక్యూటివ్ ఏసీ చైర్ కోచ్ లు ఉంటాయి. మొత్తం 1,128 మంది ఒకేసారి ప్రయాణించడానికి వీలుగా ఈరైలును తీర్చిదిద్దారు.

Vande Bharat Express : కటకటాల్లోకి త్రీ ఇడియట్స్.. విశాఖలో వందే భారత్ రైలుపై రాళ్ల దాడి చేసిన నిందితులు అరెస్ట్

♦ వందేభారత్ రైలు విశాఖ పట్టణం స్టేషన్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు ప్రతీరోజూ రెండు ట్రిప్పులు ఉంటుంది. విశాఖ నుంచి సికింద్రాబాద్ (20833) వచ్చే రైలు.. ఉదయం విశాఖపట్టణంలో 5.45 గంటలకు రైలుబయలుదేరుతుంది. రాజమండ్రి (ఉదయం 7.55), విజయవాడ ( ఉదయం 10.00), ఖమ్మం (11 గంటలకు), వరంగల్ (12.05 గంటలకు), సికింద్రాబాద్ (2.15 గంటలకు) చేరుకుంటుంది.

 

♦ సికింద్రాబాద్ నుంచి విశాఖపట్టణం (20834) వెళ్లే వందేభారత్ రైలు మధ్యాహ్నం 3గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో బయలుదేరుతుంది. వరంగల్ (4.35 గంటలకు), ఖమ్మం (సాయంత్రం 5.45 గంటలకు), విజయవాడ (రాత్రి 7గంటలకు), రాజమండ్రి (రాత్రి 8.58 గంటలకు), విశాఖపట్టణం (రాత్రి 11.30 గంటలకు) చేరుకుంటుంది.

ట్రెండింగ్ వార్తలు