Pee Stain Jeans Sale : మీ ఫ్యాషన్ తగలేయ్యా.. అమ్మకానికి మూత్రంతో తడిసిన జీన్స్ ప్యాంట్.. ధర ఎంతో తెలిస్తే షాకవుతారు!

ఈ జీన్స్ ప్యాంటు చూడటానికి అచ్చం మూత్రం పోసుకున్నట్టుగా ఉంటుంది. మూత్రంతో తడిసిన మరకల మాదిరిగా జీన్స్ ప్యాంట్ కనిపిస్తుంది.

Pee Stain Jeans Sale : ఇదేం ప్యాంటురా బాబోయ్.. బూట్ కట్ ప్యాంట్ చూశాం.. పెన్సిల్ కట్ ప్యాంట్ చూశాం.. ఇప్పుడు టోర్న్ జీన్స్ పాంట్లను చూస్తూనే ఉన్నాం.. మోకాళ్ల దాకా చిరిగిన ప్యాంట్లను ధరించి ఫ్యాషన్ అంటున్నారు. చిరిగిన ప్యాంట్లు వేసుకున్నారా? లేదా చింపుకున్నారా? డౌట్ రావడం ఖాయం.. ఈ చిరిగిన ప్యాంట్లే తెగ ట్రెండింగ్‌‌లో ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ఇవి చాలదన్నట్టు.. కొత్త టైప్ జీన్స్ కూడా వచ్చేశాయ్..

Read Also : Viral Video : బైకుపై ‘స్పైడర్ మ్యాన్-ఉమెన్’ జంట షికార్లు.. షాకిచ్చిన ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు.. వీడియో వైరల్!

ఇదో కొత్త ఫ్యాషన్ అంటూ తెగ కలరింగ్ ఇచ్చేస్తున్నారు.. ఇంతకీ ఆ ప్యాంటు ఎలా ఉందో చూస్తే నవ్వు ఆపుకోలేరంతే.. ఎందుకంటే.. ఈ జీన్స్ ప్యాంటు చూడటానికి అచ్చం మూత్రం పోసుకున్నట్టుగా ఉంటుంది. మూత్రంతో తడిసిన మరకల మాదిరిగా జీన్స్ ప్యాంట్ కనిపిస్తుంది. నడుం కింది భాగంలో ముందువైపు రెండువైపులా తడిసినట్టుగా కనిపిస్తుంది. ఈ జీన్స్ ప్యాంటు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఈ జీన్స్ ప్యాంటు చూసి నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.

వాస్తవానికి ఈ జీన్స్ ప్యాంటు ధర ఎంతో తెలిస్తే షాకవుతారు. మూత్రం మరకలతో కనిపించే ఈ ప్యాంటు ధర అక్షరాలా 811 డాలర్లు అంట.. భారత కరెన్సీలో రూ.67,600 అనమాట. లైట్ వెర్షన్ జీన్స్ ప్యాంటు కూడా ఉందట.. దీని ఖరీదు 608 డాలర్లు కాగా.. మన కరెన్సీలో రూ.50వేలు అంట..

ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతున్న ఫ్యాషన్ ప్రపంచంలో క్రియేటివిటీకి హద్దులు లేవు. బ్రిటన్ ఇటాలియన్ బ్రాండ్ డిజైనర్లు జోర్డాన్ బోవెన్, లుకా మార్చెట్టోల ఆలోచనే ఈ సరికొత్త జీన్స్ ప్యాంటు.. పైగా దీనికి పీ స్టెయిన్ డెనిమ్ అనే పేరుతో ముందుకు తెచ్చారు. 2023 వింటర్ రన్‌వేలో ఈ జీన్స్ డిజైన్ చేయగా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో చర్చకు దారితీసింది. జీన్స్ ప్యాంటు జిప్ ఉండే మధ్య భాగంలో మూత్రపు మరకతో డార్క్ కలర్ కలిగి ఉంటుంది. చూడటానికి అచ్చం ప్యాంటులో మూత్ర విసర్జన చేసినట్లుగా కనిపిస్తుంది.

ఇప్పుడు, ఈ జీన్స్‌పై నెటిజన్లు సరదాగా కామెంట్లతో జోకులు పేలుస్తున్నారు. మూత్రం మరకలతో జీన్స్ ప్యాంట్ ఏంటి.. ఇదేమి ఫ్యాషన్ బాబోయ్ అంటూ కామెంట్ చేయగా.. మరో నెటిజన్ ఇదో కొత్త రకం ఫ్యాషన్ అనుకుంట అంటూ పోస్టు చేశాడు. చిరిగిన ప్యాంట్లకే దిక్కులేదంటే.. మూత్రంతో తడిసిన ప్యాంట్లు ఎవరు కొంటారు.. కొన్నా ఏం చేసుకుంటారంటూ కామెంట్ చేశాడు.

ఇంత ఖరీదు పెట్టి మూత్రం పోసిన ప్యాంట్లను కొనే బదులు.. వేసుకున్న ప్యాంట్ లోనే మూత్రం పోసుకుంటే సరిపోతుందిగా అంటూ మరో నెటిజన్ ఫన్నీగా స్పందించాడు. 1970వ దశకంలో ఇలా ఉంటే.. తాను చిన్నపిల్లాడిలా ఉండేవాడిని అని నెటిజన్ తెలిపాడు.

Read Also : Viral Video : చిన్ననాటి జ్ఞాపకాలు.. 90లో ఈ బర్త్‌డే పార్టీ ప్లేట్ గుర్తుందా? మీరూ ఇలానే సెలబ్రేషన్స్ చేసుకున్నారా?

ట్రెండింగ్ వార్తలు