Viral Video : చిన్ననాటి జ్ఞాపకాలు.. 90లో ఈ బర్త్‌డే పార్టీ ప్లేట్ గుర్తుందా? మీరూ ఇలానే సెలబ్రేషన్స్ చేసుకున్నారా?

ఈ పార్టీ ప్లేట్ చూడగానే ఆ 90వ దశకం నాటి వారు ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్లకుండా ఉండలేరు. ఇప్పుడు అలాంటి పాత రోజులను గుర్తుకు తెచ్చే వైరల్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Viral Video : చిన్ననాటి జ్ఞాపకాలు.. 90లో ఈ బర్త్‌డే పార్టీ ప్లేట్ గుర్తుందా? మీరూ ఇలానే సెలబ్రేషన్స్ చేసుకున్నారా?

This 90s Birthday Party Plate Will Bring Back Happy Childhood Memories

Updated On : April 27, 2024 / 8:15 PM IST

Viral Video : 90వ దశకం.. ఆ పాత రోజులే వేరు.. చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటే ఎంతో అనుభూతిని కలిగిస్తాయి. ఆ రోజులు మళ్లీ వస్తే బాగుండు అని ప్రతిఒక్కరికి అనిపిస్తుంది. అప్పట్లో పుట్టినరోజు వేడుకులు ఎలా జరుపుకునేవాళ్లో గుర్తుందా? 90వ దశకంలో పుట్టిన ప్రతి పిల్లవాడు తమ బర్త్‌డే పార్టీలను తప్పక గుర్తుంచుకుంటాడు. అప్పటి పిల్లలు తమకిష్టమైన వేషధారణల్లో బర్త్‌డే పార్టీలకు వెళ్లి గేమ్స్ ఆడటం, డ్యాన్స్ చేయడం, బర్త్ డే టోపీలను ధరించి వేడుకల్లో చిరుతిళ్లను తినే రోజులు అవి.

అప్పట్లో ప్రతి పుట్టినరోజు వేడుకల్లో ఒక బర్త్‌డే పార్టీ ప్లేట్ తప్పక ఉండేది. బర్త్‌డే కేక్ కట్ చేసిన వెంటనే ఆ కేక్ ముక్కలతో పాటు చిరుతిళ్లను ఆ పార్టీ ప్లేటులోనే వేసి మరి వడ్డించేవారు. ఈ పార్టీ ప్లేట్ చూడగానే ఆ 90వ దశకం నాటి వారు ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్లకుండా ఉండలేరు. ఇప్పుడు అలాంటి పాత రోజులను గుర్తుకు తెచ్చే వైరల్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

8 మిలియన్లకు పైగా వ్యూ వచ్చిన ఈ వీడియోను @theflavorfulbowl అనే వ్యక్తి పోస్టు చేశారు. ఈ వైరల్ వీడియోలో పైనాపిల్ కేక్, సమోసా, చిన్న రసగుల్లా, చాక్లెట్లు, కారా మిక్సర్, ఆలూ చిప్స్, బిస్కెట్లు, స్వీట్లతో ఉన్న పార్టీ ప్లేట్ ఉంది. అంతేకాదు.. పక్కనే ఒక గ్లాసు మామిడి రసం కూడా ఉంది. అన్ని ఈ ప్లేటులోనే పెట్టుకుని చక్కగా ఆరగించేవాళ్లం కదా అని అనుకోకుండా ఉండలేరు.

మీకు కూడా ఇది చూడగానే మీ చిన్ననాటి రోజుల గుర్తుకు వచ్చాయా? ఇన్‌స్టాలో పోస్టు చేసిన ఈ వీడియోను చూసి చాలామంది నెటిజన్లు తమ చిన్ననాటి రోజులను గుర్తుచేసుకుంటున్నారు. పుట్టినరోజు పార్టీ ప్లేట్ గురించి ఆనాటి జ్ఞాపకాలను ఒక్కొక్కటిగా పంచుకున్నారు. కొంతమంది నూడుల్స్, పట్టీ, గులాబ్ జామూన్ తినడం గురించి గుర్తు చేసుకున్నారు.

ఇదే పార్టీ ప్లేట్ గురించి ఒక యూజర్ ఇలా కామెంట్ చేశాడు.. ‘నేను మొదట ఏమి తినాలి అనే విషయంలో చాలా గందరగోళంగా ఉండేవాడిని’ అని గుర్తు చేసుకోగా.. మరొకరు.. నమ్ కీన్ కేక్ పై ఉన్న క్రీమ్ కు అతుక్కునేదని సరదగా కామెంట్ చేశాడు. ఇలా ప్రతిఒక్కరూ తమ చిన్ననాటి విషయాలను ఒక్కొక్కటిగా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.

Read Also : Viral Video : బైకుపై ‘స్పైడర్ మ్యాన్-ఉమెన్’ జంట షికార్లు.. షాకిచ్చిన ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు.. వీడియో వైరల్!

 

View this post on Instagram

 

A post shared by TheFlavorfulBowl (@theflavorfulbowl)