Viral Video : బైకుపై ‘స్పైడర్ మ్యాన్-ఉమెన్’ జంట షికార్లు.. షాకిచ్చిన ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు.. వీడియో వైరల్!

ఈ వీడియోలో స్పైడర్ మ్యాన్ దగ్గరికి స్పైడర్ ఉమెన్ వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తుంది. ఆ వెంటనే రైడ్ వెళ్దామా అంటూ ఆమె అడుగుతుంది. అతడు వెంటనే ఓకే అంటూ చేతులు కలిపి బైక్‌‌పై వెనుక కూర్చోమని అంటాడు.

Viral Video : బైకుపై ‘స్పైడర్ మ్యాన్-ఉమెన్’ జంట షికార్లు.. షాకిచ్చిన ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు.. వీడియో వైరల్!

Spiderman, Spiderwoman Went For A Bike Ride. Cops Arrested Them

Viral Video : అతడు స్పైడర్ మ్యాన్.. ఆమె స్పైడర్ ఉమెన్.. ఇద్దరూ కలిసి ఢిల్లీ వీధుల్లో బైకుపై షికారు కొట్టారు. సూపర్ హీరోల వేషధారణలో మోటార్ సైకిలుపై విన్యాసాలు చేస్తూ అడ్డంగా బుక్కయ్యారు. చివరికి వీరిద్దరిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన నైరుతి ఢిల్లీలోని ద్వారకలో జరిగింది. బైకుపై విన్యాసాలు చేసినందుకు స్పైడర్‌మ్యాన్, స్పైడర్ ఉమెన్ జంటను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఢిల్లీ ట్రాఫిక్ పోలీసుల ప్రకారం.. నంబర్ ప్లేట్, అద్దాలు లేని బైక్‌పై లైసెన్స్ లేకుండా రైడ్‌‌కు వెళ్లారు. స్పైడర్‌మ్యాన్ ఆదిత్య (20), అతని స్నేహితురాలు స్పైడర్-ఉమెన్ అంజలి (19) బైక్‌పై ‘స్పైడర్‌మ్యాన్ నజాఫ్‌గఢ్ పార్ట్ 5’ పేరుతో బైక్‌పై రైడ్ చేస్తూ ఇన్‌స్టాగ్రామ్ రీల్‌ను రికార్డ్ చేసినట్టు ధృవీకరించారు.

ఈ వీడియోలో స్పైడర్ మ్యాన్ దగ్గరికి స్పైడర్ ఉమెన్ వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తుంది. ఆ వెంటనే రైడ్ వెళ్దామా అంటూ ఆమె అడుగుతుంది. అతడు వెంటనే ఓకే అంటూ చేతులు కలిపి బైక్‌‌పై వెనుక కూర్చోమని అంటాడు. ఇద్దరూ కలసి ఢిల్లీ వీధుల్లో స్పైడర్ మ్యాన్ వేషధారణలో బైక్ రైడ్ చేశారు.

జూమ్ చేస్తే స్పైడర్‌మ్యాన్ జంట ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం కనిపించింది. కెమెరాకు పోజులు ఇస్తూ డ్యాన్స్ మూవ్‌లో కనిపించారు. ఆ తర్వాత బైక్ రైడ్ సెల్ఫీ వీడియోను ఇన్‌స్టాలో అప్‌లోడ్ చేశారు. ఈ ఇన్‌స్టా రీల్ వైరల్ కావడంతో ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసి మోటారు వాహన చట్టం కింద చలాన్ జారీ చేశారు.

అయితే, ‘నజాఫ్‌గఢ్ స్పైడర్‌మ్యాన్’ సూపర్ హీరో వేషధారణతో ఢిల్లీ వీధుల్లో షికార్డు చేయడం నజఫ్‌గర్ నివాసి ఆధిత్యకు ఇదేం తొలిసారి కాదు. ఇండియన్ స్పైడీ అఫీషియల్ అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఇతడికి ఉంది. తన విన్యాసాల వీడియోలను ఈ అకౌంట్‌లోనే పోస్ట్ చేస్తాడు. అతని బయో ‘యువర్ ఫ్రెండ్లీ నైబర్‌హుడ్ ఇండియన్ స్పైడీ’ అనే పేరుతో ఉంది.

ఈ అకౌంటుకు దాదాపు 10వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. కొన్ని వీడియోలకు 70వేల కన్నా ఎక్కువ లైక్‌లు వచ్చాయి. అతని ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ‘ఇండియన్ స్పైడీ’ బ్యాడ్మింటన్ ఆడుతూ, ట్రాక్టర్ నడుపుతూ ట్రెండింగ్ పాటల్లో డ్యాన్స్ చేస్తూ వీడియోల్లో కనిపించాడు. అంతేకాదు.. కాలేజీ ఫెస్ట్‌లు, కాస్ప్లే ఈవెంట్‌లు, యానిమే ఫ్యాన్స్ వంటి షోలలో కూడా ఆదిత్య ప్రదర్శనలు ఇచ్చాడు.

Read Also : Yash : వైరల్ అవుతున్న KGF యశ్ కొత్త లుక్ చూశారా? గడ్డం తగ్గించి.. ‘టాక్సిక్’ సినిమా కోసమేనా..?