NEET UG 2024 : నీట్ యూజీ 2024 మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్.. త్వరలో అడ్మిట్ కార్డ్‌లు విడుదల!

NEET UG 2024 : మే 5న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు దేశవ్యాప్తంగా 571 నగరాలు, 14 విదేశీ నగరాల్లో పరీక్ష జరగనుంది.

NEET UG 2024 : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) త్వరలో నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET-UG) 2024 అడ్మిట్ కార్డ్‌లను విడుదల చేయనుంది. అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి ఈ అడ్మిట్ కార్డ్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అంతేకాదు.. నీట్ యూజీ అభ్యర్థులు లాగిన్ వివరాల ద్వారా తెలుసుకోవచ్చు. వచ్చేవారంలో అడ్మిట్ కార్డులు విడుదలయ్యే అవకాశం ఉంది.

మే 5న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు దేశవ్యాప్తంగా 571 నగరాలు, దేశం వెలుపల 14 నగరాల్లో ఆఫ్‌లైన్ (పెన్ మరియు పేపర్) మోడ్‌లో పరీక్ష జరుగనుంది. ఏజెన్సీ పరీక్ష నగర ఇంటిమేషన్ స్లిప్‌ను కూడా రిలీజ్ చేసింది.

రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీని ఉపయోగించి అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. స్లిప్‌లో పరీక్షా కేంద్రం ఉన్న నగరం కేటాయింపు గురించి సమాచారం అందిస్తుంది. మొత్తం 23,81,833 మంది విద్యార్థులు, 10 లక్షల మంది విద్యార్థులు, 13 లక్షల కన్నా ఎక్కువ మంది విద్యార్థినులు నీట్ యూజీ 2024 పరీక్ష కోసం రిజిస్టర్ చేసుకున్నారు.

అదనంగా, 24 మంది విద్యార్థులు ‘థర్డ్ జెండర్’ కేటగిరీ కింద రిజిస్టర్ చేసుకున్నారు. మొత్తం రిజిస్టర్ చేసిన విద్యార్థులలో 10 లక్షలకు పైగా ఓబీసీ ఎన్‌సీఎల్ కేటగిరీకి చెందినవారు ఉండగా, 6 లక్షల మంది సాధారణ విద్యార్థులు, 3.5 లక్షల మంది షెడ్యూల్డ్ కులాల (SC) వర్గానికి చెందినవారు, 1.8 లక్షల మంది జనరల్ -(EWS) కేటగిరీకి చెందినవారు, షెడ్యూల్డ్ తెగల (ST) కేటగిరీకి చెందిన 1.5 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు.

Read Also : CBSE Boards Exam 2024 : పరీక్షల ఒత్తిడిని తగ్గించుకోవడానికి విద్యార్థులకు సీబీఎస్ఈ సూచనలు.. ఏం చేయాలి? ఏం చేయకూడదంటే?

ట్రెండింగ్ వార్తలు