CM Sacks Health Minister: అవినీతి ఆరోపణలు.. మంత్రిని తొలగించిన పంజాబ్ సీఎం

అవినీతి ఆరోపణల నేపథ్యంలో క్యాబినెట్ మంత్రిని తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు పంజాబ్ సీఎం భగవంత్ మన్ సింగ్. పంజాబ్‌లో ఆప్ ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం ఇటీవలే కొలువుదీరిన సంగతి తెలిసిందే.

CM Sacks Health Minister: అవినీతి ఆరోపణల నేపథ్యంలో క్యాబినెట్ మంత్రిని తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు పంజాబ్ సీఎం భగవంత్ మన్ సింగ్. పంజాబ్‌లో ఆప్ ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం ఇటీవలే కొలువుదీరిన సంగతి తెలిసిందే. కొత్త మంత్రివర్గంలో ఆరోగ్య శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు విజయ్ సింఘ్లా. ఆయనకు క్యాబినెట్ హోదా కూడా ఉంది.

Tirumala: శ్రీవారి భక్తులకు దళారి టోకరా.. అభిషేకం టిక్కెట్ల పేరుతో మోసం

అయితే, విజయ్ సింఘ్లాపై ఇటీవల అవినీతి ఆరోపణలొచ్చాయి. ఆరోగ్య శాఖకు సంబంధించి వివిధ కాంట్రాక్టులకుగాను అధికారుల నుంచి ఒక శాతం కమిషన్ అడుగుతున్నారని ఆయనపై ఆరోపణలొచ్చాయి. దీంతో ప్రభుత్వం విచారణ జరిపింది. ఈ విచారణలో మంత్రి ఒక శాతం కమిషన్ అడిగినట్లు ఆధారాలు లభించాయి. ఆరోపణలు రుజువు కావడంతో ఆయనను మంత్రివర్గం నుంచి తొలగిస్తూ మంగళవారం సీఎం భగవంత్ మన్ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు మంత్రిపై కేసు నమోదు చేయమని కూడా పోలీసులకు సూచించినట్లు సీఎం తెలిపారు. ఈ విషయంపై ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా స్పందించారు.

Qutub Minar Row: కుతుబ్ మినార్‌ను దేవాలయంగా మార్చలేం: పురాతత్వ శాఖ

అవినీతి ఆరోపణలు వచ్చిన సొంత నేతలపై చర్యలు తీసుకునే దమ్ము, నిజాయితీ తమ పార్టీకి మాత్రమే ఉన్నాయని రాఘవ్ చద్దా అన్నారు. గతంలో ఇలాంటి నిర్ణయం ఢిల్లీలో తీసుకున్నామని, ఇప్పుడు పంజాబ్‌లో తీసుకున్నామని ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. తమ పార్టీ అవినీతిని సహించదని, ముఖ్యమంత్రి నిర్ణయం అభినందించదగ్గది అని ట్వీట్ చేశారు.

ట్రెండింగ్ వార్తలు