Rahul Gandhi: విదేశీ గడ్డపై దేశాన్ని అవమానించారన్న బీజేపీ విమర్శలపై రివర్స్ అటాక్ చేసిన రాహుల్ గాంధీ

విదేశాల్లో ఎవరూ భారత్ పరువు తీయడం లేదు. ప్రతి ఒక్క పౌరుడు బాధ్యతతోనే ఉన్నారు. కానీ ఈ దేశ ప్రధానమంత్రి మాత్రమే ఈ దేశ పరువు తీశారు, ఇంకా తీస్తూనే ఉన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి భారతదేశంలో ఏమీ చేయలేదని, ఈ దేశం కోసం ఎంతో చేసిన అందరి తల్లులను, తండ్రులను, తాతలను మోదీ అవమానించారు

Rahul Gandhi: బ్రిటన్ రాజధాని లండన్‌లోని ప్రపంచ ప్రఖ్యాత కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ఇచ్చిన ఉపన్యాసంలో భారతదేశాన్ని అధ్వాన్నంగా చూపించారంటూ కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ మీద అధికార పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. అయితే బీజేపీ నేతలు చేస్తున్న ఈ విమర్శలపై రాహుల్ ఘాటుగా రివర్స్ అటాక్ చేశారు. వాస్తవానికి దేశాన్ని కించపరించింది తాను కాదని, ప్రధానమంత్రి నరేంద్రమోదీయే తన రాజకీయ అవసరాల కోసం దేశాన్ని విదేశాల్లో అవమానపర్చారని అన్నారు.

Karnataka Assembly Polls: వేసవికి ముందే హీటెక్కిన కర్ణాటక.. మిగతావారి కంటే ఒక అడుగు ముందే ఉన్న ఓవైసీ

స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి దేశం సాధించిన విజయాలను విదేశీ వేదికల మీద మోదీ కించపరిచారట. విదేశాల్లో దేశం పరువు తీసిన ఘనత నరేంద్రమోదీదే అని రాహుల్ తనదైన శైలిలో ప్రతిదాడికి దిగారు. ‘‘భారతదేశంలో అపరిమిత అవినీతి ఉందంటూ విదేశాల్లో ఆయన (మోదీ) అనడం నాకింకా గుర్తుంది. కానీ నేనెప్పుడూ నా దేశం పరువు తీయలేదు. దానిపై నాకు ఆసక్తి లేదు. ఎప్పటికీ చేయను. అయితే బీజేపీ నన్ను ట్విస్ట్ చేయడానికి ఇష్టపడుతుంది. దాన్ని నేను కాదనలేను” అని రాహుల్ అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘విదేశాల్లో ఎవరూ భారత్ పరువు తీయడం లేదు. ప్రతి ఒక్క పౌరుడు బాధ్యతతోనే ఉన్నారు. కానీ ఈ దేశ ప్రధానమంత్రి మాత్రమే ఈ దేశ పరువు తీశారు, ఇంకా తీస్తూనే ఉన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి భారతదేశంలో ఏమీ చేయలేదని, ఈ దేశం కోసం ఎంతో చేసిన అందరి తల్లులను, తండ్రులను, తాతలను మోదీ అవమానించారు’’ అని తీవ్రంగా విరుచుకుపడ్డారు.

Manish Sisodia: విద్యామంత్రిని ప్రేమిస్తున్నామంటూ పోస్టర్.. పాఠశాలపై కేసు నమోదు

కాగా రాహుల్ గాంధీని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ‘టుక్డే టుక్డే గ్యాంగ్’తో పోలుస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు. రాహుల్ తన ఉపన్యాసంలో తనతో సహా చాలా మంది మంత్రులపై నిరంతర నిఘా కొనసాగుతోందని, భారత ప్రజాస్వామ్య ప్రాథమిక నిర్మాణంపై దాడి జరిగుతోందని ఆరోపించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలు, పార్లమెంట్, మీడియా, న్యాయవ్యవస్థ రాజీ పడ్డాయంటూ రాహుల్ కఠినమైన ఆరోపణలు చేశారు.

Slow Internet Fix : మీ ఇంటర్నెట్ స్లో అయిందా? Wi-Fi రాంగ్ కనెక్షన్‌ కారణం కావొచ్చు.. ఇలా మార్చి చూడండి..!

రాహుల్ ప్రసంగంపై తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ “భారత న్యాయవ్యవస్థ స్వతంత్రమైనది. భారత న్యాయవ్యవస్థను ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించమని ఎవ్వరూ, ఎప్పుడూ బలవంతం చేయలేరు. ప్రజాస్వామ్యం మన రక్తంలో ఉంది. భారత ప్రజాస్వామ్యాన్ని ఎవరూ ప్రశ్నించలేరు’’ అని అన్నారు. శనివారం భువనేశ్వర్‌లో ఏర్పాటు చేసిన కేంద్ర న్యాయవాదుల సదస్సును రిజిజు ప్రారంభించారు. అనంతరం ఈ సమావేశం గురించి స్పందిస్తూ న్యాయమూర్తుల విజ్ఞత ప్రజల పరిశీలనకు మించినదని రిజిజు అన్నారు.

ట్రెండింగ్ వార్తలు