Karnataka Assembly Polls: వేసవికి ముందే హీటెక్కిన కర్ణాటక.. మిగతావారి కంటే ఒక అడుగు ముందే ఉన్న ఓవైసీ

ఇందులో భాగంగానే ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్-ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ఆదివారం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించారు. లతీఫ్ ఖాన్ పఠాన్ - బెలగావి నార్త్, దుర్గప్ప బిజావాడ్ - హుబ్లీ ధద్వాడ్ ఈస్ట్ నుంచి పోటీ చేయనున్నారు. ఇక మూడవ అభ్యర్థి బసవన భాగేవాడి, అల్లాబక్ష్ బీజాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు ఓవైసీ వెల్లడించారు.

Karnataka Assembly Polls: దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలంటే ఎక్కడాలేని హీట్ వస్తుంది. ఈ యేడాది చివర్లో ఆ రాష్ట్రానికి ఎన్నికలు జరగనున్నాయి. వేసవి ప్రవేశించడానికి కూడా ఇంకాస్త సమయం ఉంది. కానీ కర్ణాటక అప్పుడే వేడెక్కింది. రాజకీయ పార్టీలో రోడ్ షోలు, ప్రచారాలతో ఎన్నికల ప్రచారం ఎప్పుడో ప్రారంభమైంది. రాష్ట్రంలో అధికార, విపక్ష పార్టీలు జాతీయ పార్టీలే కావడంతో.. ఢిల్లీ-బెంగళూరు సెక్షన్‭లో ట్రాఫిక్ జామ్ పెరిగింది. బీజేపీ, కాంగ్రెస్ అగ్ర నేతలు రాష్ట్రంలో వరుస పర్యటనలు చేస్తున్నారు.

Mumbai: ఫేక్ లింక్స్‌పై క్లిక్ చేసిన బ్యాంక్ కస్టమర్లు.. 40 అకౌంట్ల నుంచి లక్షలు కొట్టేసిన సైబర్ కేటుగాళ్లు

కాగా, రాష్ట్రంలోని ప్రధాన పార్టీలని కాదని ఎంఐఎం పార్టీ ఒక విషయంలో ముందడుగు వేసింది. ఆదివారం ఆ పార్టీ ముగ్గురు అభ్యర్థులతో తన తొలి జాబితాను విడుదల చేసింది. కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ పార్టీలు అభ్యర్థుల ప్రకటన గురించి పలు సందర్భాల్లో ప్రకటనలు చేసినప్పటికీ అభ్యర్థులను మాత్రం ప్రకటించలేదు. అయితే వారిని కాదని, ఎంఐఎం ఒక అడుగు ముందే ఉండడం గమనార్హం. ఇప్పటి వరకు కర్ణాటక అసెంబ్లీలో ఒక్క అభ్యర్థిని గెలుచుకోని ఆ పార్టీ, ఈ సారి ఎలాగైనా అసెంబ్లీ అడుగు పెట్టే ఆలోచనతో అడుగులు వేస్తోంది.

Rijiju vs Rahul: టుక్డే టుక్డే గ్యాంగ్ అంటూ రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించిన కేంద్ర మంత్రి రిజిజు

ఇందులో భాగంగానే ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్-ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ఆదివారం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించారు. లతీఫ్ ఖాన్ పఠాన్ – బెలగావి నార్త్, దుర్గప్ప బిజావాడ్ – హుబ్లీ ధద్వాడ్ ఈస్ట్ నుంచి పోటీ చేయనున్నారు. ఇక మూడవ అభ్యర్థి బసవన భాగేవాడి, అల్లాబక్ష్ బీజాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు ఓవైసీ వెల్లడించారు.

ట్రెండింగ్ వార్తలు