పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్

దీనిపై విచారించిన ఏపీ హైకోర్టు.. ఇరుపక్షాల వాదనలు వింది. అనంతరం తీర్పు రేపటికి రిజర్వ్ చేసింది.

Pinnelli Ramakrishna Reddy : ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్ పై తీర్పు రిజర్వ్ అయ్యింది. ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో తనపై నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన ఏపీ హైకోర్టు.. ఇరుపక్షాల వాదనలు వింది. అనంతరం తీర్పు రేపటికి రిజర్వ్ చేసింది.

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కేసులో రికార్డులు తారుమారు జరిగాయని హైకోర్టులో పిన్నెల్లి తరపు న్యాయవాదులు వాదించారు. డీజీపీ, పోలీసులు కలిసి రికార్డులు తారుమారు చేసినట్లు చెప్పారు. పిన్నెల్లిపై పెట్టిన కేసుల్లో పోలీసులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని కోర్టుకు తెలిపారు. కౌంటింగ్ సమయంలో పిన్నెల్లి లేకుండా చేయడానికి కుట్ర జరుగుతోందన్నారు న్యాయవాదులు. పోలీసులు కోర్టుకు తప్పుడు సమాచారం అందించారని, రికార్డులు పరిశీలించాలని పిన్నెల్లి లాయర్లు కోరారు.

దీంతో కోర్టు రికార్డులను పరిశీలించింది. పిన్నెల్లిపై అదనంగా మోపిన మూడు కేసులు మే 23న నమోదు చేసి.. మే 24నే స్థానిక మెజిస్ట్రేట్ కు తెలియపరిచినట్టుగా రికార్డుల్లో ఉందని కోర్టు దృష్టికి తెచ్చారు. ఇదొక తప్పుడు సంప్రదాయమని తెలిపారు. కాగా, పిన్నెల్లిపై నమోదైన కేసులపై హైకోర్టులో టీడీపీ లీగల్ సెల్ న్యాయవాది పోసాని ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు.

ఈవీఎం ధ్వంసం కేసులో పిన్నెల్లికి కోర్టు బెయిల్ ఇవ్వడంతో పాటు జూన్ 5వ తేదీ వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణను 6వ తేదీకి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. తర్వాత పిన్నెల్లిపై మరో మూడు కేసులు నమోదయ్యాయి. మొత్తం నాలుగు కేసులు ఉన్నాయి. ఒక దాంట్లో ముందస్తు బెయిల్ వచ్చింది. మిగిలిన మూడు కేసులపై ఇవాళ విచారణ జరిగింది. మే 13న అల్లర్లకు కేసుకు సంబంధించి పిన్నెల్లిపై తాజాగా మూడు కేసులు నమోదయ్యాయి. పాల్వాయి గేట్ వద్ద బూత్ నెంబర్ 202లో టీడీపీ ఏజెంట్ పై గొడ్డలితో దాడి, కారంపూడిలో సీఐపై దాడి, పాల్వాయి గేట్ బూత్ నెంబర్ 202 వద్ద నాగశిరోమణి అనే మహిళపై దాడి జరిగింది. ఈ మూడు ఘటనలకు సంబంధించి పిన్నెల్లిపై మూడు కేసులు నమోదయ్యాయి.

Also Read : ఆ 4 నియోజకవర్గాల్లో గెలిచిన పార్టీదే అధికారం..! ఏపీ ఎన్నికల్లో ఈసారి ఆ సెంటిమెంట్ రిపీట్ అవుతుందా?

ట్రెండింగ్ వార్తలు